Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

సర్వం సిద్ధం

Afganistan Test match with India from today

బ్యాటింగే బలం..

అఫ్గాన్‌తో జరిగే చారిత్రక టెస్టు మ్యాచ్‌లో భారత్‌కే మెరుగైన అవకాశాలున్నాయి. బ్యాటింగ్‌లో భారత్‌కు ఎదురేలేదు. ప్రపంచలోనే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ టీమిండియాకు అందుబాటులో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా బ్యాటింగే భారత్‌కు ప్రధాన బలంగా మారింది. ఓపెనర్ల స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. శిఖర్ ధావన్, మురళీ విజయ్, లోకేష్ రాహుల్‌ల మధ్య ఓపెనింగ్ స్థానం కోసం పోటీ ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా ఎవరు దిగుతారనే దానిపై ఇంకా అనిశ్చిత తొలగలేదు. కాగా, ధావన్, విజయ్‌లు ఓపెనర్లుగా దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదే జరిగితే రాహుల్ మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా రానున్న ఇంగ్లండ్ పర్యటనకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే లక్షంతో ధావన్, విజయ్‌లు ఉన్నారు. వీరిద్దరికి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. మెరుగైన ఆరంభంతో జట్టుకు అండగా నిలువాలని ఇద్దరు భావిస్తున్నారు. మరోవైపు రాహుల్ కూడా జోరు మీదున్నాడు. ఐపిఎల్‌లో మెరుపులు మెరిపించడంతో అతనిపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇద్దరిపైనే భారం..
విరాట్ కోహ్లి లేక పోవడంతో జట్టు బ్యాటింగ్ భారాన్ని మో సేందుకు సీనియర్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారాలు సిద్ధంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరిపై భారీ ఆశలున్నా యి. రహానెకు ఈ మ్యాచ్ సవాలుగా మారింది. రానున్న ఇం గ్లండ్ పర్యటన నేపథ్యంలో దీనిలో రాణించాల్సిన ఒత్తిడి అతనిపై నెలకొంది. ఇందులో సత్తా చాటితే ఇంగ్లండ్ పర్యటనకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యే అవకాశం ఏర్పడుతోంది. పుజా రా కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. జట్టులో అత్యంత నిలకడైన బ్యాట్స్‌మన్‌గా పేరు తె చ్చుకున్న పుజారా చెలరేగితే అఫ్గాన్ బౌలర్లకు కష్టాలు ఖా యం. ఇక, చాలా రోజుల తర్వాత మళ్లీ టెస్టు జట్టులో చోటు సంపాదించిన కరుణ్ నాయర్‌పై కూడా జట్టుకు భారీ ఆశలే ఉన్నాయి. అతనికి తుది జట్టులో స్థానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించిన నాయర్ తర్వాత ఆ జోరును కొనసాగించలే పోయాడు. ఈసారి అవకాశం లభిస్తే సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నా డు. వృద్ధిమాన్ సాహా స్థానంలో జట్టులోకి వచ్చిన దినేష్ కా ర్తీక్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. అఫ్గాన్‌పై రాణించ డం ద్వారా రానున్న ఇంగ్లండ్ సిరీస్‌లో చోటు సంపాదించాలనే లక్షంతో ఉన్నాడు. చాలా కాలం తర్వాత కార్తీక్‌కు టె స్టుల్లో చోటు దక్కింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లతో భారత బ్యాటింగ్ బలంగా ఉంది.
స్పిన్నర్లే కీలకం..
ఈ మ్యాచ్‌లో భారత్ స్పిన్నర్లపై భారీ ఆశలు పెట్టుకొంది. సొంత గడ్డపై అద్భుత రికార్డు కలిగిన అశ్విన్, జడేజాలు ఈసారి కూడా జట్టుకు ప్రధాన అస్త్రాలుగా ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది. ఈ మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలనే లక్షంతో టెస్టుకు సిద్ధమయ్యారు. ఇందులో రాణించడం ద్వారా రానున్న ఇంగ్లండ్ సిరీస్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే లక్షంతో వీరు కనిపిస్తున్నారు. ఉమేశ్ యాదవ్, ఇషాంత్, హార్దిక్ పాండ్యలతో భారత ఫాస్ట్ బౌలింగ్ కూడా బలంగా ఉంది. కొత్త బౌలర్ నవదీప్ సైనీకి తుది జట్టులో స్థానం లభిస్తుందా లేదా అనేది ఇంకా తేలలేదు.

Comments

comments