Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

అందరి కళ్లు అఫ్గాన్‌పైనే..

AFGHAN

బెంగళూరు: వన్డేలు, టి20లలో సంచలన విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్న పసికూన అఫ్గానిస్థాన్ గురువారం నుంచి టెస్టు ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. బెంగళూరు వేదికగా భారత్‌తో అఫ్గాన్ తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ ప్రస్థానం ప్రారంభించి కొద్ది రోజులే అయినా అఫ్గాన్ సంచలన విజయాలతో అందరిని ఆకట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్, బంగ్లాదేశ్, విండీస్, జింబాబ్వే, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లను ఓడించి పెను ప్రకంపనలే సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన బౌలర్‌గా పేరుతెచ్చుకున్న రషీద్ ఖాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఎలా రాణిస్తాడనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన రషీద్ చెలరేగితే భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే ఐర్లాండ్ జట్టు టెస్టు ప్రస్థానాన్ని ప్రారంభించింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ అద్భుత పోరాట పటిమతో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా అఫ్గాన్ కూడా టెస్టు క్రికెట్‌కు శ్రీకారం చుట్టనుంది. ఈ మ్యాచ్ కోసం అఫ్గాన్ ముమ్మర సాధన చేసింది. భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలనే లక్షంతో అఫ్గాన్ కనిపిస్తోంది.

Comments

comments