Search
Tuesday 19 June 2018
  • :
  • :

సిద్ధమవుతున్న బంగార్రాజు స్క్రిప్ట్

bangaraj

అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో ఓ మంచి చిత్రంగా నిలిచింది. ఈ సీనియర్ స్టార్‌కు ఓవర్సీస్‌లోనూ మార్కెట్ పెంచిన చిత్రమిది. ఆ క్రమంలోనే మంచి హిట్ అందుకున్న హుషారులో ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని… కళ్యాణ్‌కి మరో అవకాశం ఇస్తానని ప్రకటించాడు. అయితే ఆతర్వాత ఇతరత్రా ప్రాజెక్టులతో నాగార్జున బిజీ అయిపోయాడు. ఈ క్రమంలో కళ్యాణ్‌కృష్ణ… రవితేజతో ‘నేల టిక్కెట్’ చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా కళ్యాణ్ పైనా, అతను తీర్చిదిద్దిన ‘బంగార్రాజు’ స్క్రిప్టుపైనా పూర్తి నమ్మకంతో నాగార్జున ఈ సీక్వెల్‌కు ఓకే చెప్పాడని తెలిసింది. అయితే ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్ డ్రాఫ్ట్ నాగార్జునకు ఇంకా వినిపించాల్సి ఉందట. కళ్యాణ్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసి నాగార్జునకు వినిపిస్తాడట. సాధ్యమైనంత తొందరలోనే ఈ మూవీని ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిసింది. ఇక రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘ఆఫీసర్’ మూవీ నాగార్జునకు నిరాశనే మిగిల్చిన సంగతి తెలిసిందే. దీని నుంచి కోలుకునేందుకు మంచి బ్లాక్‌బస్టర్ కొట్టాలని ఈ సీనియర్ స్టార్ కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘బంగార్రాజు’ సినిమా చేసి ఘన విజయాన్ని అందుకోవాలని నాగార్జున ఆశిస్తున్నాడు.

Comments

comments