Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

బచ్చలితో రక్తహీనతకు చెక్

ఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమమైన స్థానం ఉంది. ఇది తెలీని వాళ్లు అంటూ ఉండరు. దీనిలో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. బచ్చలిలో రెండు రకాలు ఉన్నాయి. తీగబచ్చలి, కాడబచ్చలి. ఎక్కువగా కాడబచ్చలి మనకి దొరుకుతుంది. తీగబచ్చలిని ఇంటి పెరట్లోకూడా పెంచుకోవచ్చు.

Spinach

బచ్చలి ఆకులను కందిపప్పుతో తింటే గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇంకా బాలింతలు, చిన్నపిల్లలకు ఐరన్ ఎక్కువ అవసరం.  దీనిని రోజూ తీసుకోవడం వల్ల కీళ్ళనొప్పుల సమస్య కూడా తగ్గుతుంది.   అదే విధంగా బచ్చలి ఆకులను రోజుకు రెండు పూటలా నమిలి మింగుతూ ఉంటే నాలుక మీద ఏర్పడే పొక్కులు తగ్గిపోతాయి. బచ్చలి వేడిని తగ్గిస్తుంది. ఆకులు నూరి కణతలుకు పట్టీవేస్తే తలలోని వేడి తగ్గి నిద్ర బాగా పడుతుంది.  తరచూ దగ్గు, పైత్యం, అతిదాహం తగ్గుతుంది. ఈ కూరను ఆహారంలో ఉపయోగించడం వల్ల ఆకలి పెరుగుతుంది. పైల్స్ కారణంగా ఏర్పడే బాధలు తగ్గుతాయి. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యకరమైన మెదడు, నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బచ్చలి ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పెడితే పుండ్లు  తగ్గుతాయి.  మూత్రవిసర్జనలో  ఇబ్బందులు వస్తే  రోజూ యాభై మి.లీ.  బచ్చలి కషాయాన్ని తీసుకుంటే మంచిది. తీగ బచ్చలి కూరను  తింటే కంఠ స్వరం మృదువుగా మారుతుంది. రక్తశుద్ధి చేసి నోటి అరుచిని పోగుడుతుంది.  పచ్చకామెర్లు వచ్చి తగ్గాక బచ్చలి కూర తింటే త్వరగా కోలుకుంటారు. బచ్చలి ఆహారంలో చేర్చుకోవటంవల్ల చర్మానికి కొత్త మెరుపును ఇస్తుంది.  మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. బచ్చలి ఆకు రసానికి  చెంచాడు తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజూ డైట్‌లో బచ్చలి కూరను చేర్చుకోవచ్చు.

Comments

comments