Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఏర్పాటు సరే ఎన్నికలేవి?

arrangements ok when elections,

మళ్లీ మున్సిపాల్టీగా భద్రాచలం ?
ఎన్నికలే లేని మణుగూరు
రెండు దశాబ్దాలుగా పాలక వర్గం లేని పాల్వంచ
మున్సిపాల్టీ ఎన్నికల నిర్వహణపై ఎవరు కనపర్చని ఆసక్తి
గ్రామ పంచాయతీగా కొనసాగించలేని పక్షంలో ఆందోళనకు సిద్ధం

మన తెలంగాణ/ఖమ్మం : ఏజెన్సీ ప్రాంతంలో మున్సిపాల్టీలను ఏర్పాటు చేయడం ఎన్నికలు నిర్వహించకపోవడం ఒక అనవాయితీగా మారింది. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే రెండు మున్సిపాల్టీలు పాలక వర్గాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మళ్లీ భద్రాచలం పట్టణాన్ని మున్సిపాల్టీ చేయాలన్న ఆలోచనలో ఉందన్న వార్తలు విన్పిస్తున్నాయి. గతంలోనే దీనిని మున్సిపాల్టీగా మార్చి ఏజెన్సీ చట్టాలు తదితర వ్యవహారాల్లో తిరిగి గ్రామ పంచాయతీగా మార్చారు. ఇప్పుడు మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడనుంది. గతంలో పాల్వంచ మున్సిపాల్టీగా ఏర్పాటు చేశారు. రెండు దఫాలు మాత్రమే ఎన్నికలు జరిగిన తర్వాత కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. న్యాయస్థానం ఇంత వరకు ఎన్నికలకు సంబంధించి తుది తీర్పు రాకపోవడంతో  దీన్ని గురించి ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోకపోవడంతో పాల్వంచ మున్సిపాల్టీ ఎన్నికలకు నోచుకోవడం లేదు. గతంలో అధికార యంత్రాంగం పొరపాట్లు చేయడం, అవినీతికి పాల్పడడం జరిగింది. తీవ్ర ఆరోపణలు వచ్చిన సందర్బంలో బదిలీలు చేశారు. ఇవ్వన్నీ పాలక వర్గం లేకపోవడం వల్లే జరిగాయని తెలిసినా పాలక వర్గం ఏర్పాటుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ నడుమ పాల్వంచ నలిగిపోతున్న దశలోనే మణుగూరు మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాల్టీగా మార్చారు. మున్సిపాల్టీగా మార్చారే తప్ప ఇంత వరకు ఇక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. అభివృద్ది పూర్తిగా కుంటుపడింది. అధికారుల పనితీరు తరుచూ వివాదమవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. గతంలో మున్సిపాల్టీకి ఎన్నికలు నిర్వహించాలని ఆందోళనలు సైతం నిర్వహించారు. ప్రభుత్వం మాత్రం మణుగూరు మున్సిపాల్టీకి ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశ్యంలో లేనట్లు తెలుస్తుంది. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ సమస్యపై జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకోవడమంటే తేనె తుట్టెను కదిపినట్లే నన్న భావన వ్యక్తమవుతుంది. అందు కే పాల్వంచ, మణుగూరు మున్సిపాల్టీ ఎన్నికల నిర్వహణపై ఎవరు ఆసక్తి ప్రదర్శించడం లేదు. దీనికి మించి పాలక వర్గాలు లేకపోతే ఇక్కడి ప్రజాప్రతినిధులు పెత్త నం చేయవచ్చునన్న ఆలోచనతో ఎన్నికలు నిర్వహించకుండా కాలం గడుపుతున్నారు. ఒక దఫా ప్రతిపక్ష శాస న సభ్యులు ఉన్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ప్రయ త్నం చేసినా అధికార పక్షం అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఇది చాలదన్నట్లు భద్రాచలాన్ని కూడా మున్సిపాల్టీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాల్టీగా మారిస్తే ఇదే పరిస్థితి. ఇప్పటికే చేతులు, కాళ్లు లేని మొండెంలా తయారైంది భద్రాచలం పరిస్థితి. చుట్టు గ్రామాలన్నీ ఆంధ్రాలో విలీనమై ఏకాకిగా భద్రాచలం పట్టణం మిగిలిపోయింది. ప్రస్తుతం భద్రాచలం పట్టణ మే మండలంగా అదే గ్రామ పంచాయతీగా ఉంది. ఇ ప్పుడు అది కూడా లేకపోతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనా భద్రాచలంలో కనీస వసతుండవని, అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని దీన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని లేని పక్షంలో ఆందోళనకు సిద్ధమని ఆదివాసీ సంఘాలు ప్రకటిస్తున్నాయి. మున్సిపాల్టీలు ఏర్పాటు చేయడమే కాదు ఎన్నికల నిర్వహణ పైన దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments