Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

నిలకడగా వాజ్ పేయి ఆరోగ్యం

Atal Bihari Vajpayee stable, responding to treatment: New bulletin

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కిడ్నీ సంబంధిత సమస్యతో సోమవారం ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్)లో చేరిన సంగతి తెలిసిందే. కాగా, మంగళవారం ఎయిమ్స్ వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని ఈ బులెటిన్ ద్వారా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయనకు యాంటిబయాటిక్స్ వాడుతున్నామని వైద్యులు పేర్కొన్నారు. అయితే, ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకూ అటల్ జీ ఆస్పత్రిలోనే ఉంటారని వివరించారు.

Comments

comments