Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

కస్టడీలోంచి పారిపోయిన బంగ్లాదేశ్ జాతీయుడు

CRIME

మధ్యప్రదేశ్: భారత్ భూ భాగంలోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశ్ జాతీయుడు పోలీస్ కస్టడీ నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. గ్వాలియర్ లోని గాంధీనగర్ పడావ్ పోలీస్ స్టేషన్ నుంచి అతడు తప్పించుకొని పారిపోయాడు. అక్రమంగా ఇండియాలో ప్రవేశించినందుకు నిందితుడు మూడేళ్లు పాటు పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఇండియాను వదిలి తన స్వదేశానికి వెళ్లడానికి ఇంకా అనుమతి లభించలేదు. అయిన అతడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments