Search
Tuesday 19 June 2018
  • :
  • :

అంకుల్‌ డ్యాన్స్‌ అదుర్స్…!(వీడియో)

Best wedding performance by Uncle in Gwalior

వివాహ వేడుకల్లో గానాబజానా కామన్. ఇక నృత్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లికి వచ్చినవారిలో చాలా మంది చిందులేయడం కూడా  అంతే కామన్. అయితే వారిలో కొందరి డ్యాన్స్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమావాళ్లను తలపించేలా నృత్యం చేస్తూ అక్కడివారిని కట్టిపడేస్తుంటారు. అచ్చం ఇలాగే జరిగింది గ్వాలియర్‌లోని ఓ వివాహ వేడుకలో… వివాహ వేడుకలో 46 ఏళ్ల వ్యక్తి తన డ్యాన్స్‌తో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్నాడు. బాలీవుడ్‌ నటుడు గోవిందా నటించిన ‘ఖుద్గర్జ్’‌ చిత్రంలోని పాటకు ఆయన చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఆయన వేసిన డ్యాన్స్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో డ్యాన్స్‌ చేసిన వ్యక్తి పేరు శ్రీవాస్తవ. భోపాల్‌కు చెందిన ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన గ్వాలియర్‌లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లినపుడు గోవిందా నటించిన ‘ఖుద్గర్జ్’లోని పాటకు అదిరిపోయే స్టెప్పులతో పెళ్లికి వచ్చినవారికి కనులవిందు చేశారు. ఆయన డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతే… అది కాస్తా వైరల్‌ అవుతోంది. శ్రీవాస్తవ నృత్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ మేరకు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం లయ బద్దంగా శ్రీవాస్తవ వేసిన స్టెప్పులపై మీరూ ఓ లుక్కేయండి.

Comments

comments