Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

వర్కవుట్స్ మరింత ఎఫెక్టివ్‌గా…

Exercise

ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం అవసరం. ఎక్సర్‌సైజ్‌తో ఆర్యోగంగా ఉండటమే కాకుండా అందంగా, దృఢంగా ఉంటాం. ఎప్పుడైనా వ్యాయామం చేస్తున్న సమయంలో మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తుంటాం. దానివల్ల సరైన ఫలితం ఉండదు. కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తే చేసే పనిలో మరింత మజా వస్తుంది.

* ప్లాన్ చేసుకోండి : కొంతమంది కొత్తగా వ్యాయామం చేయడం మొదలుపెడతారు. అలాంటి వారు ఓ ప్రణాళిక వేసుకుంటే బాగుంటుంది. ప్లాన్ లేకుండా కిలోమీటర్ల దూరం పరుగెత్తడం, జిమ్‌కి వెళ్లి అక్కడున్న వాటితో గంటల కొద్ది ఎక్సర్‌సైజ్ చేయడం వంటివి చేస్తుంటారు. కాని అలా చేయడం చాలా ప్రమాదం. అలాంటి సమయంలో ముందుగా ఒక ప్లాన్ చేసుకుండి. ఎలాంటి వర్కవుట్స్‌ని ఎంత సమయంలో చేయాలో రాసి పెట్టుకోండి. ఒక్కరే సొంతంగా నిర్ణయం తీసుకోకుండా మీ ట్రైనర్‌తో మాట్లాడుకుని తను చెప్పిన వాటిని పాటించండి. జిమ్‌కి వెళ్లే ప్రతి ఒక్కరు కండలు పెంచుకోవడానికి వెళ్లరు. ఇతరులను చూసి కాపీ కొట్టకుండా మీ శరీరానికి ఏది సరిపొతుందో దానిని మాత్రమే ఎంచుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం మీరు ఫిట్‌నెస్ అనేది గుర్తుంచుకోవాలి. జిమ్‌కి వెళ్లినప్పుడు షూ, వాటర్‌బాటిల్స్ వంటి కావాల్సిన వస్తువులను అమర్చుకోవాలి.

* వ్యాయామానికి ముందు వార్మప్ తప్పనిసరి : మీరు అనుకున్న వెంటనే మీరు కోరుకున్న ఫిట్‌నెస్‌ని మీరు పొందలేరు. వ్యాయామానికి ముందు శరీరం ఒక్కసారిగా సిద్ధ పడదు. అందుకే కొంత సమయం వార్మప్ చేయాల్సివస్తుంది. దాని కోసం కొన్ని చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి. అందులో ఒకటి శ్వాసని లోపలికి బయటకి వదులుతు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయాలి.

* మధ్యలో మానొద్దు : ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఆ పనిని మధ్యలో వదిలేయడం ద్వారా మీరు అనుకున్నది రీచ్ కాలేకపోతారు. అందులో ముఖ్యంగా వ్యాయామం కొంతమంది సగం సగం నేర్చుకుని వదిలేస్తుంటారు. అలా చేయడం వల్ల దేంట్లో పర్‌ఫెక్ట్ కాలేరు. జిమ్‌కి వెళ్లిన మొదట్లో విపరీతంగా కష్టపడి తరువాత ఒక్కసారిగా జిమ్‌కి వెళ్లడం మానుకుంటే అసలుకే మోసం వస్తుంది. ఒక వేళ మానేయాలని అనుకునే వారు ఆ కోర్సు మీకు జిమ్ వర్కవుట్స్ ఎలా చేయాలో తెలిసి మీరు ఒక్కరే సొంతంగా చేసుకునేలా వచ్చేవరకు నేర్చుకుని తరువాత ఇంట్లో చేస్తుండడం మంచిది.

* టెక్నిక్స్ తెలుసుకోండి : ఒక పరీక్ష రాయాలంటే టీచర్, బుక్స్‌ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో మంచి ఫిట్‌నెస్ రావాలంటే జిమ్‌కి వెళ్లినప్పుడు సరైన ట్రైనర్‌ని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. రెండురోజులు చేసిన వెంటనే, లేదా యుట్యూబ్‌లో చూసి సొంతంగా చేయడం వంటివి వదిలేసి అతను చెప్పే వాటిని ఆచరించాలి. దాంతో శరీరం ఫిట్‌నెస్‌తో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా చేయడం ద్వారా మీరు కోరుకున్న ఫిట్‌నెస్ మీ సొంతం అవుతుంది.

Comments

comments