Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్లు

Boeing to deliver made-in-India Apache helicopters

వాషింగ్టన్ : భారతదేశానికి ఆరు ఎహెచ్ 64ఇ అపాచీ దాడి సామర్థ  అటాక్ హెలికాప్టర్ల విక్రయ ఒప్పందానికి అమెరికా సమ్మతించింది. ఈ హెలికాప్టర్ల విలువ 93 కోట్ల డాలర్లు వరకూ ఉంటుంది. అంటే రూపాయలలో భారతదేశం 6200 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ హెలికాప్టర్లతో పాటు అమెరికా నుంచి భారత్‌కు హెల్‌ఫైర్, స్ట్రింగర్ మిస్సైల్స్ కూడా అందుతాయి. భారతదేశం రక్షణ పాటవాన్ని పెంచుకునేందుకు వీలేర్పడుతుందని, ప్రాంతీయ స్థాయిలో దాడుల ముప్పులను ఎదుర్కొనేందుకు దేశ రక్షణకు ఈ హెలికాప్టరు క్షిపణుల సరఫరా దోహదం చేస్తుందని పెంటగాన్ వర్గాలు బుధవారం తెలిపాయి. భారత్‌కు వీటి విక్రమాలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్‌కు పెంటగాన్ ఒక అధికారిక నోటిఫికేషన్‌ను అందించింది. వచ్చే నెలలో వాషింగ్టన్ డిసిలో ఇండియా , అమెరికా మధ్య తొలి 2ప్లస్ 2 స్థాయి సంప్రదింపులు జరుగుతాయి. ఇందులో భారత్ తరఫున రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొంటారు. అమెరికా వైపు నుంచి ఆ దేశ విదేశాంగ , రక్షణ మంత్రులు మైక్, జేమ్స్ మాట్టిస్‌లు పాలుపంచుకుంటారు. అమెరికా రక్షణ శాఖ భారతదేశం విషయంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి ఆ దేశ చట్ట సభలకు అత్యున్నత భద్రతా సంస్థ పెంటగాన్ వివరణ ఇచ్చుకుంది. వీటి అమ్మకాలపై ఏ విధమైన వ్యతిరేకత వ్యక్తం కాకపోతే అంతా సవ్యంగా జరుగుతుంది. అపాచీ హెలికాప్టర్లు అత్యంత దాడి సామర్థంతో బహుళార్థకంగా ఉంటాయి. వీటిని అమెరికా సైన్యం, పలు అంతర్జాతీయ సైనిక బలగాలు వాడుతున్నాయి. ఇప్పటి విక్రయం పరిధిలో మంటలనుఅదుపు చేసే రాడార్లు, హెల్‌ఫైర్ సుదూర స్థాయి క్షిపణులు , స్ట్రింగర్ మిస్సైల్స్ కూడా ఉన్నాయి.

Comments

comments