Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

ఘనంగా మత్తడి పోచమ్మకు బోనాలు

Bonuses to the great moth swing

మనతెలంగాణ/వేములవాడ: వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు మహిళలు బుధవారం మత్తడిపోచమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. ఈసందర్భంగా మహిళలు మున్నూరుకాపు రాష్ట్ర నాయకులు కొండ దేవయ్య ఆధ్వర్యంలో బోనాలతో డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా బయలు దేరి, వేములవాడ శివారులోని మత్తడి పోచమ్మ ఆలయం వరకు చేరుకున్నారు. అనంతరం ఆలయంలోని శ్రీఅమ్మవారికి వారు తీసుకువచ్చిన నైవేద్యాలను పెట్టి, మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్ పర్సన్ నామాల ఉమ, బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్, టిపిసిసి కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు   ఎర్రం మహేష్‌లతో పాటు అన్ని పార్టీ నాయకులు ,చిలుక రమేష్, బింగి మహేష్, సాగరం వెంకటస్వామి, నామాల పోశెట్టి, కూరగాయల కొమురయ్యలతో పాటు మున్నూరుకాపు సోదరులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

comments