Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

చీకటి గుండెలో కొండంత వెలుగు

మంత్రి కెటిఆర్‌కు, మన తెలంగాణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన కొమురంభీం జిల్లా వృద్ధ దంపతులు పంగిడి చీకటి, బాయక్క

Old-Man

మంచిర్యాల ప్రతినిధి : కొమురంభీం జిల్లాలోని చింతలమానేపెల్లి మండలం కర్జెల్లి ఎస్‌టి కాలనీకి చెందిన పంగిడి చీకటి, బాయక్క దంపతుల పూరిగుడిసె మీద వసూలు చేసిన  రూ.500ల  ఇం టి పన్నును తిరిగి చెల్లించాలని వారికి డబుల్ బెడ్ రూం ఇల్లు , ఆసరా పింఛన్ మంజూరు చేయాలని  ఆదేశించిన  రాష్ట్ర   ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌కు, తమ నుంచి  దయారహితంగా పన్ను వసూలు చేసిన ఉదంతాన్ని ముందుగా ప్రచురించి కదలిక తీసుకు వచ్చిన మన తెలంగాణ దినపత్రికకు ఆ వృద్ద జంట ప్రత్యేక కృత జ్ఞతలు తెలియజేశారు. ఆసరా, డబుల్ బెడ్‌రూం ఇల్లు  ఇస్తున్నట్టు కలెక్టర్ ప్రశాంత్ పాటిల్  స్థానిక ఎంపిడిఒ ద్వారా ఈ దంపతులకు తెలియజేశారు. మనతెలంగాణ దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించి పలువురు దాతలు వృద్ధ దంపతులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎంఎల్‌ఎ పాల్వాయి రాజ్యలక్ష్మి తనయుడు పాల్వాయి హరీష్‌బాబు యువసేన ఆధ్వర్యంలో వృద్ధ దంపతులకు ఇంటి ముందు పందిరివేసి రేకులతో పైకప్పు ఏర్పాటు చేశారు. అదే విధంగా దర్జీ సంఘం వారు పూరి గుడిసె పైకప్పు కురియకుండా టార్పాలిన్ కవర్లు ఏర్పాటు చేశారు. మరికొందరు దాతలు వృద్ధ దంపతుల దయనీయ పరిస్థితులు చూసి వారికి దుస్తులు, వంట సామాగ్రి, వంట సరుకులు, బియ్యం అందజేశారు

Comments

comments