Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

బంగారం బిస్కేట్ల పట్టివేత

Gold

శంషాబాద్: అక్రమంగా విదేశాల నుండి బంగారం బిస్కేట్‌లు హైదరాబాద్‌కు తరలిస్తున్న మూఠాను డిఆర్‌ఐ అధికారులు పట్టుకొని వారి నుండి కిలోన్నర బంగారం బిస్కేట్‌లు స్వాధినం చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… విదేశాల నుండి పెద్ద మొత్తంలో బంగారంను తరలిస్తున్నట్టు పక్క సమాచారం అందడంతో ఎయిర్‌పోర్టులో నిఘా పెట్టి తనిఖీ చేయగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారి నుండి కిలోన్నర బంగారం బిస్కేట్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయనికి తరలించినట్లు తెలిపారు.

Comments

comments