Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఓరుగల్లు గులాబీమయం

 Celebrate the flags and organizing the celebrations

మన తెలంగాణ/ వరంగల్ బ్యూరో : ఓరుగల్లు గులాబీ మయం అయి ంది. ప్రభుత్వాధినేతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పాల్గొని సం బరాలు చేసుకున్నారు. జెండాలను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అభివృద్ది కార్యక్రమాలను  వివరించి ప్రజా సేవలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించారు. పలు అభువృధ్ధి పథకాలు దేశానికే  దిక్సూచీగా నిలుస్తున్నాయని  అన్నారు. ఉమ్మడి ఓరుగల్లు వ్యాప్తంగా జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా ఓరుగల్లు నగరంలో ఉపముఖ్యమ్రంతి కడియం శ్రీహరి, రూర ల్ జిల్లాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీ, మహాబూబాబాద్‌లో మంత్రి చందూలాల్, జనగామలో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జయశంకర్ జిల్లాలో స్పీకర్ మదుసుదనాచారిలు పాల్గొన్నారు. ఆయా జిల్లాలలో జెండాలను ఎగురవేసి సభలలో పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలస్తోందన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలు చోట్ల సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఉడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగిరథ, మిషన్ కాకతీయ, లాంటి పథకాలలో నీటివ్యవస్థను సుగమం చేసి దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యా, వైద్య రంగాలలో దేశాన్నే ఆకర్శించే విఆధంగా వినూత్స పద్దతులకు శ్రీకారం చుట్టిందన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. పంట పెట్టుడి పథకాన్ని ప్రారంభించి దేశాన్నే ఆకర్శించిందిందన్నారు. కెసిఆర్ పాలన దేశంలోనే ఆదర్శ ప్రాయంగా నిలుస్తోందన్నారు. అన్ని నంగాల ప్రజలన ఉఆదుకునే విధంగా కేసిఆర్ పాలన కొరసాగిస్తున్నారని అన్నారు.ఆయా ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులుచ, నాయకులు పాల్గొన్నారు.

Comments

comments