Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

బాచుపల్లిలో చెడ్డి గ్యాంగ్ హల్‌చల్

Cheddi Gang Hulch in Bachupalli

మళ్లీ చెలరేగిన దొంగలు 8నిజాంపేటలో చోరీ యత్నం
సీసీ కెమెరాలను చూసి పారిపోయన వైనం

మన తెలంగాణ/ బాచుపల్లి: కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న చెడ్డి గ్యాంగ్ దొంగలు మళ్లీ పంజా విసురుతున్నారు. తాజాగా  ఒక అపార్ట్‌మెంటులోకి  దొంగతనానికి వచ్చి చోరీ చేయకుండానే పారిపోయిన సం ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేట గ్రామంలో చోటుచేసుకుంది. బాచుపల్లి పో లీస్ స్టేషన్ సిఐ బాలకృష్ణారెడ్డి , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నిజాంపేట గ్రామంలోని బండారీ లేఅవుట్ కాలనీ రోడ్డు నెంబర్ 5లోని శ్రీరామ నిలయం అపార్టుమెంటులోకి  ఇద్దరు ని క్కర్లు ధరించిన దొంగలు ఆదివారం రాత్రి ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించారు. వాచ్‌మెన్ రూంకి బయట నుంచి గొళ్లెం పెట్టి  మెట్ల ద్వారా పైకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఎదురుగా సీసీ కెమెరాలు కనిపించడంతో భయంతో వెంటనే పారిపోయారు. తెల్లవారుఝామున వాచ్‌మెన్ లేచి తలుపు తీయగా బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో వెంటనే వాచ్‌మెన్ అపార్టుమెంటులో నివసిస్తున్న వారికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో వారు వచ్చి రూం గడియ తీసి వాచ్‌మెన్‌ను బయటికి తీసుకువచ్చారు. ఎవరు గడియ వేశారు, అసలు ఏం జరిగివుంటుందని వారు వెంటనే అపార్టుమెంటులోని సీసీ పుటేజీలను పరిశీలించగా రాత్రి ఇద్దరు చెడ్డి దొంగలు చోరీకి వచ్చారని ,సీసీ కెమెరాలను చూసి పారిపోయినట్టుగా రికార్డు అవ్వడంతో వెంటనే వారు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సీసీ పుటేజీని పరిశీలించి వారు చెడ్డీ గ్యాంగ్ దొంగలు అని నిర్దారించుకున్న పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంలను రంగంలోకి దించినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసుల పహరాను పెంచాలి…స్థానికులు
మళ్లీ చెడ్డి దొంగలు వచ్చారని తెలిసిన జనం తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. చోరీకి ప్రయత్నించిన అపార్టుమెంటు చివరగా ఉండటం ,తుర్క చెరువు కట్ట కింద ఖాళీ ప్రదేశం నుంచి దొంగలు వచ్చివుంటారని అనుమానిస్తున్నారు. రాత్రి పూట పోలీసుల పహారా పెంచాలని స్థానికులు కోరుకుంటున్నారు.
ప్రజలు భయపడవద్దు … బాచుపల్లి పోలీసులు
పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉందని ,దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంలను రంగంలోకి దించామని ,సీసీ కెమెరాల ఏర్పాటు మూలంగానే చోరీ చేయడానికి వచ్చిన దొంగలు తోక ముడుచుకుని పారిపోయారని ,అలాగే సిసి కెమెరాల వల్ల చాలా కేసుల విచారణ చేసి దోషులను శిక్షంచడం జరిగింది. కావున ప్రతి కాలనీ వారు వీధుల్లో , ప్రతి అపార్టుమెంటులో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని బాచుపల్లి సిఐ బాలకృష్టారెడ్డి ప్రజలకు విజ్ఙప్తి చేశారు.

Comments

comments