Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఢిల్లీ బయల్దేరిన సిఎం కెసిఆర్

Telangana CM KCR Leaves for Delhi

హైదరాబాద్ : సిఎం కెసిఆర్ గురువారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సిఎం కెసిఆర్ ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా కెసిఆర్ శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమస్యలపై ప్రధానితో సిఎం చర్చిస్తారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థకు పలు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సిఫారసుచేయాలని ప్రధాని మోడీని కెసిఆర్ కోరుతారు. రైతాంగాన్ని ఆర్థిక పరంగా ఆదుకోవడానికి పంట పెట్టుబడి పథకం కింద టిఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.8 వేలు ఇస్తుందని, ఈ సంవత్సరం మొదటి పంట సాయం కింద ఇప్పటికే ఎకరానికి రూ.4 వేలు ఇచ్చిన విషయాన్నిప్రధాని మోడీకి తెలియజేయన్నారు. ఉపాధిహామీ పథకాన్నివ్యవసాయానికి అనుసంధానం చేయాలని, రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రధానికి సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేయనున్నారు. అంతే కాకుండా హైకోర్టు విభజన, ఎయిమ్స్‌కు నిధులు, పన్నులలో వాటాపెంపు, ప్రాజెక్టులకు సహకారం, పెండింగ్‌ లో ఉన్న బిల్లుల విడుదలతోపాటు తెలంగాణకు చెందిన వివిధ అంశాలపై ఈ భేటీలో కెసిఆర్ ప్రధానితో ముచ్చటించే అవకాశం ఉంది. జూన్ 17వ తారీఖున ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి రావాలని నీతిఆయోగ్ ఇదివరకే ఆహ్వానించింది. ఈ సమావేశానికి సిఎం కెసిఆర్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Comments

comments