Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

70 ఏళ్లుగా అన్నపానీయాలు ముట్టుకోని యోగి!

YOGI-PRAHALAD

అహ్మదాబాద్: ఆయన గుజరాత్ చెందిన ఓ యోగి. అతని పేరు ప్రహ్లాద్ జాని, వయసు 88 ఏళ్లు దీంట్లో గొప్ప ఏంటీ అంటారా..? అక్కడికే వస్తున్నాం… 70 ఏళ్లుగా ఈ స్వామీజీ తిండి తినకుండా, నీరు తాగకుండా ఉండటమే! మెహసానా జిల్లా చరోడ్ ఈయన స్వగ్రామం. అంబను కొలిచే ఆయనను భక్తులు మాతాజీగా పిలుచుకుంటారు. ఎన్నో ఏండ్లుగా ప్రహ్లాద్ సైంటిస్టుల ప్రయోగాలకు వేదికగా మారారు. ఈ యోగిపై పరీక్షలు జరిపిన వారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కూడా ఉన్నారు. 70 సంవత్సరాలుగా ఏమీ తినకుండా ఎలా  ఉంటున్నారో అర్థం కాక చాలా మంది సైంటిస్టులు సైతం తలలు పట్టుకున్నారు. అంతేకాకుండా ఆయనకు ఎన్నో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. డెబ్భై సంవత్సరాలు తిండి, నీరు కాకుండా కేవలం శ్వాస తీసుకుంటూ ఎలా బతుకుతున్నడన్న అనుమానంతో ఆయన ఆశ్రమంలోని మొక్కలపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అయిన కూడా ప్రహ్లాద్ జీవనం విధానం ఎవరికి అంతుచిక్కకపోవడం గమనార్హం.

ఇదిలాఉండగా 2010లో ఓసారి డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెనస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ఒక ఈ యోగిపై అధ్యయనం నిర్వహిచారు. యోగిని పదిహేను రోజుల పాటు ఒంటరిగా ఒక దగ్గర ఉంచి, ప్రతిక్షణం వీడియో మానిటరింగ్ చేశారు. అనంతరం ఆయనకు ఎమ్మారై, అల్ట్రాసౌండ్, తదితర వైద్య పరీక్షలు కూడా జరిపారు. వీటి ద్వారా వారికి ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అసాధారణ రీతిలో ఆకలి, దాహాన్ని తట్టుకునే లక్షణాలు ఆయనకు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. అయితే కేవలం ధ్యానంతోనే తనకు శక్తి లభిస్తుందని ప్రహ్లాద్ చెప్తున్నారు. ఆయన దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఆయన ఆశ్రమాన్ని సందర్శిచిన వారిలో  ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. ఎలాంటి ఫీజులు తీసుకోకుండానే వారి సమస్యలకు చక్కని పరిష్కారం చూపిస్తుంటారట ఈ యోగి.

Comments

comments