Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

చీకటి పల్లెల్లో వెలుగులు నింపడమే సిఎం లక్ష్యం

CM aims to fill out the light in dark villeges

భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను
వేములపల్లిలో 33/11కెవి విద్యుత్‌సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి

మన తెలంగాణ/మొగుళ్లపల్లి : గత 60 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతాన్ని సమైక్యాంధ్ర పాలకులు పాలించినప్పటికీ అభివృద్ధిని విస్మరిస్తే…. 4 ఏళ్ల్లలో  చేసి చూపించామని తెలంగాణ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ ప్రాంతంలోని చీకటి పల్లెల్లో, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామంలో కోటి 25 లక్షలతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరికొండ 60 ఎండ్లలో అబివద్దిని విస్మరిస్తే…. 4ఏండ్లలో చేసి చూపించాం మధుసూదనాచారి మాట్లాడుతూ భూపాలపల్లి ని యోజకవర్గంలోని అన్ని మండల గ్రామాల్లో విధ్యుత్ పునరుద్దికరణ పనులకు 116 కోట్ల నిధులను మం జూరు చేయడం జరిగిందని, మౌళిక వసతి సౌకార్యాల కల్పనే ద్యేయంగా గత 35 సంవత్సరాలకు పైగా అబివద్ది చెందుతున్న నియోజకవర్గాలకు దీటుగా భూపాలపల్లినియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అబివృద్దికి కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుసలో ఉండేలా పాటు పడుతున్నానని తెలిపారు. మారుమూల ప్రాంతాల ప్రజల సంక్షేమం, అబివృద్ది ధ్యేయంగా కులమతాలకు అతీతంగా ఆసరా, కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్, పాఠశాలల్లో మధ్యాహ్నం సన్నబియ్యంతో బోజనం, రైతులకు రైతుబందు, రైతుబీమా, మహిళలకు డెలివరి సమయంలో కెసిఆర్‌కిట్లు, నిరుద్యోగులకు ఉపాదీకై సబ్సీడీ పథకాలు, గోల్లకుర్మలకు, మత్సకారులకు సబ్సీడీపై గోర్రెలు, చేపపిల్లల పంపిణీ, సబ్సీడిపై రైతు సహకార సంఘాలకు వ్యవసాయ పరికరాల పనిముట్లతో పాటు సబ్పీడి ట్రాక్టార్స్ లాంటి పథకాలు ప్రవేశపెట్టి, విధ్య, వైధ్య రంగాలకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాలలో అబివృద్దికి పాటుపడుతూ ధేశంలోని ప్రజల చూపు తెలంగాణ వైపు చూసేలా నంబర్‌వన్ స్థానంలో సిఎం కెసిఆర్ ఉంచాడని వెల్లడించారు. రాష్ట్రాల సరిహద్దుల్లో రైతులకు సాగు నీరు, ప్రజలకు తాగునీరుకు ఇబ్బంది కలగకుండా కోట్లాది రూపాయలతో ప్రాతిష్టాత్మకమైన ప్రాజెక్టులను నిర్మీస్తూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మన సిఎం ఆదర్శంగా నిలుస్తున్నాడని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అబివృద్దిని చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీల నేతలు అవాకులు చేవకులు చేస్తూ ఆర్ధం లేని మాటలు మాట్లాడుతూ విమర్శించడం సరియైందికాదన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో పార్టీలు పక్కకు పె ట్టి కలిసి రావాలని స్పీకర్ చూసించారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ మేడిపల్లి సునీత,విధ్యుత్‌శాఖ ఎస్సీ నరేష్, డిఈలు మహేందర్, మధుసూదన్‌రావు, ఎఈ శంకర్ విధ్యుత్ సిబ్బంది టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు, జిల్లా మం డల నాయకులు మల్లయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, బక్కిరె డ్డి, భూమయ్య, గ్రామాల సర్పంచ్‌లు తదితరులున్నారు.

Comments

comments