Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

చేవెళ్ళ టికెట్… నీకా..నాకా..!

CM KCR Speech About Chevella MLA Ticket

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా: నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటే ఎవరూ కాపాడలేరు అంటూ సాక్షాత్తూ సిఎం కెసిఆర్ ఎ మ్మెల్యేలను హెచ్చరించడంతో చేవెళ్ళ టికెట్ నీకా..నాకా అంటూ ప్రచారం సాగుతుంది. ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరు బాగలేదంటూ నివేదికలు వెల్లడించాయంటూ ఈ సారి పక్కాగా టికెట్ నాకే వస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం తన అనుచరులతో ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిఎం కెసిఆర్‌ను నమ్మి పార్టీ మారి వచ్చానంటూ, మళ్లీ టికెట్ నాకే ఇస్తారంటే పార్టీని మారానంటూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో ముందున్నాను అంటూ మళ్లీ టికెట్ నాకే వస్తుందంటూ ఎమ్మెల్యే కాలే యాదయ్య తన అన అనుచరులకు భరోసా ఇస్తుండంతో నియోజకవర్గంలో నాయకులు అయోమయంలో ఉనా ్నరు. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్ గాలి విచినా చేవెళ్ళలో మాత్రంలో హస్తం విజయం సాధించడం తెలిసిందే. జిల్లా నేతల దృష్టి అంతా చేవెళ్ళ నియోజకవర్గంపైనే ఉంది.ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు వర్గాలుగా ముద్రపడ్డ నేతలు కూడా ఉన్నారు. ఇరువురు నేతలు తమ దైనశైలీలో బలం నిరూపించుకుంటున్నారు. ఇరువురు నేతలు తమ జన్మదినంను ఘనంగా నిర్వహించుకుని తమ బలం నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రేస్ పార్టీ నుండి విజయం సాదించిన ఎమ్మేల్యే కాలే యాదయ్య అ పార్టీని విడి కాంగ్రేస్ తీర్దం పూచ్చుకున్నారు. అయన వెంటనే పలువురు నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మేల్యే కెఎస్. రత్నం వర్గం కూడ పార్టీలోనే ఉన్నారు. దీంతో అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో వలస వచ్చిన ఎమ్మేల్యేలపై అధికార పార్టీలో ఉన్న కొందరు పార్టీ నాయకులు అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. అధికార కార్యక్రమాలను ఎమ్మేల్యే కాలే యాదయ్య చేస్తుండటం జరుగుతుంది. ప్రజల వద్దకు తనదైన శైలీలో వెళ్లీ తన బలం నీరూపించుకునే పనిలో మాజీ ఎమ్మేల్యే రత్నంలు నిమగ్నమయ్యరు. టికెట్‌ను ఎవరిని వరిస్తుందోనని నియోజకవర్గంలోని ప్రజలు అసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మేల్యే కాలే యాదయ్య పనితీరు బాగలేదని అయన వ్యతిరెకులు ప్రచారం చేస్తుండటం,సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్ అంటూ మాజీ ఎమ్మేల్యే రత్నం వ్యతిరెకులు ప్రచారం చేయడం చర్చాంశానీయంగా మారింది. టికెట్ ఎవరికి వస్తుందో వెచి చూడాల్సిందే.

Comments

comments