Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Collector Amrapali Speech About Elections

మన తెలంగాణ/వరంగల్ అర్భన్‌జిల్లా ప్రతినిధి: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని అర్బన్ జిల్లా కలెక్టర్ కాట అమ్రపాలి  సూచించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ స్టేజ్-1 రిటర్నింగ్ అధికారుల శిక్షణా శిబిరంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఎన్నికల నియమ, నిబంధనలకు దిశానిర్ధేశం చేశారు.  జిల్లాలో ఎన్నికలను నిర్వహించుటకు సమాయత్తం అవుతూ నామినేషన్లు స్వీకరించడానికి స్టేజ్-1 అధికారులుగా, రిటర్నింగ్ అధికారులుగా నియమించబడిన ప్రధానోపాధ్యాయులు గురువారం మాస్టర్ ట్రైనర్స్ ఎన్నికల నిర్వహణపై శిక్షణ సాగింది. ఎన్నికల నిర్వాహణకు స్టేజి-1 అధికారులు ప్రముఖ పాత్ర పోషిస్తారని, రిటర్నింగ్ అధికారులుగా నియమించబడిన ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని నియమావళి ప్రకారం మాత్రమే నామినేషన్ల స్వీకరణ, తిరస్కరణలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ యస్.దయానంద్, జెడ్పి సిఇఓ విజయగోపాల్, డిపిఓ, జిల్లా పంచాయితీ అధికారి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్స్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహిణపై ఎన్నికల నియమ నిబంధనలపై శిక్షణ ఇచ్చారు.

Comments

comments