Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

అవినీతిని సహించేది లేదు

Collector Darma reddy Speech About Passbooks

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : భూప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రికార్డులు సరిచేసేందుకు విఆర్‌వోలు అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ విధంగా అవినీతికి పాల్పడిన అధికారులను, వారికి సహకరించిన వారిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేటులోని సమావేశ మందిరంలో భూప్రక్షాళన కార్యక్రమం పెండింగ్ సవరణల గురించి జిల్లా తహసీల్దార్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… చెక్కులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రికార్డుల సవరణకు అధికారులు రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విధమైన చర్యలకు పాల్పడ్డ అధికారులతో పాటు వారికి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవడంలో వెనుకాడేదని లేదని స్పష్టం చేశారు. రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మొదలై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికి కూడా పూర్తిస్థాయిలో చెక్కుల పంపిణీ జరుగకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనమన్నారు.

పాసు పుస్తకాలు రాకుండా చెక్కులు మాత్రమే వచ్చిన రైతులకు చెక్కులు ఇచ్చేటప్పుడు ఆధార్‌కార్డును తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అధికారులు నిర్లక్షం ప్రదర్శిస్తున్నారని, అందువల్ల ఇప్పటికి కూడా పూర్తిస్థాయిలో అధార్‌కార్డు సేకరణ జరగడం లేదన్నారు. ఆయా గ్రామాల్లో ఆధార్ కార్డు సేకరణ కోసం రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు విఆర్‌ఎల సహాయం తీసుకోవాలని సూచించినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆధార్ సేకరించకపోవడం విడ్డూరమన్నారు. అధికారులు చేసే పనిని చిత్తశుద్ధ్దితో నిర్వహించాలని ఈనెల 20లోపు భూప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా పెండిగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్ద సర్వే నెంబర్లలో విస్తీర్ణం హెచ్చు తగ్గులు ఉన్న కేసుల్లో సర్వేయరుతో భూమిని కల్పించి కబ్జాలో ఉన్న వారి ప్రకారం ప్రొసీడింగు అందజేయాలన్నారు. నాన్ అగ్రికల్చర్ భూములుగా గుర్తించే వాటిని తప్పనిసరిగా నాన్ అగ్రికల్చర్‌గా ఉపయోగించినట్లైతే ఆ భూములను రికార్డుల్లో నమోదు చేయాలని ఊరికి దగ్గరగా ఉందనే నెపంతో వ్యవసాయ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా చూపించడం సరికాదన్నారు. విఆర్‌వోలు ఏది రాసుకొచ్చినా సంతకాలు పెట్టే పద్ధ్దతిని మార్చుకోవాలని రికార్డులను పూర్తిగా పరిశీలించిన అనంతరం సంతకాలు చేస్తే ఇలాంటి తప్పులు జరుగవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు నగేష్, మధు, వెంకటేశ్వర్లుతో పాటు జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొ

Comments

comments