Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

యుద్ధప్రాతిపదికన చెక్కుల పంపిణీ

Collector Gowrav Uppal Speech About Checks Distribute

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : జిల్లాలో పంపిణీ చేయకుండా ఉన్న రైతుబంధు చెక్కులు యుద్ధ ప్రాతి పదికన 3 రోజుల్లో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాధిత్య భవనంలో వ్యవ సాయ శాఖ విస్తరణ అధికారులు, ఏడిలతో జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డితో కలసి రైతుబంధు చెక్కుల పంపిణీపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 55వేల చెక్కులు పంపిణీ కాకుండా ఉన్నవని, ఇందులో సుమారు 6వేల చెక్కులు ఎన్‌ఆర్‌ఐలకు చెందినవిగా ఉన్నాయని అన్నారు. రైతు లు వేరే చోటకు వెళ్లడం, అందుబాటులో లేకపోవడం, ఎన్‌ఆర్‌ఐలు ఉంటారని అన్నారు. పంపిణీ కానీ చెక్కులు సంబంధిత రైతులకు ఫోన్ చేసి పిలిపించి 3 రోజుల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. పట్టాదారు చనిపో యినవి, ప్రభుత్వ భూమి తాలూకు చెక్కులు, భూమి టైటిల్ క్లియర్‌గా లేనివి పంపిణీ చేయకుండా విత్ హోల్డ్‌లో ఉంచినట్లు తెలిపారు. పట్టాదారు పుస్త కాలు చెక్కులు తప్పులు ఉన్నవి పంపిణీ చేయకూడదని, వాటిని తిరిగి పంపాలని అన్నారు. కొన్ని మండలాల్లో పంపిణీ చేసిన డేటా ఎంట్రీ సరిగ్గా జరగడం లేదన్నారు. పంపిణీ చేయనివి, పంపిణీ చేసిన వివరాలు, విత్‌హోల్డ్‌లో ఉంచిన చెక్కుల వివరాలు వ్యోవసాయ శాఖ ఏడిలు, వ్యవసాయ శాఖ జేడి ద్వారా పంపించాలని అన్నారు. రైతుభీమాకు సంబంధించి నామినేషన్ల ఫారంలో వివరాలు జాగ్రత్తగా నింపాలని సూచించారు. రైతు వేదికల నిర్మాణంకు స్థలాలు గుర్తించా లని అన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పోలీసు కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకో వాలన్నారు. ఖరీఫ్ సీజన్లో ఎరువులు, విత్తనాలకు కొరత ఉండవద్దని ఆదేశించారు. సమావేశంలో జేసి నారాయణరెడ్డి, వ్యవసాయ శాఖ జెడి నర్సింహ్మారావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments