Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఆర్‌టిసిపై త్వరలో కమిటీ

Telangana RTC JAC Round Table Meeting Today

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను లాభాల బాటలోకి తీసుకురావడానికి సిఫార్సుల కోసం వారం రోజుల్లో నిపుణుల సంఘం ఏర్పాటు
కమిటీలో నలుగురైదుగురు సభ్యులుండే అవకాశం
అంతర్గత సామర్థం పెంచుకొని ఆర్‌టిసిని స్వయం సమృద్ధం చేయడానికి నాలుగు అంశాలపై అధ్యయనం

మన తెలంగాణ / హైదరాబాద్ : అన్ని రాష్ట్రాల్లో నూ ఆర్థిక నష్టాల్లో ఉన్న ఆర్‌టిసి సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా పరిణమించాయి. తెలంగాణలో సైతం నష్టాల్లో ఉన్న ఆర్‌టిసిని గట్టెక్కించడానికి, లాభాల బాటలోకి తీసుకురావడాని కి త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా నాలుగు అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు, కార్మికులకు ప్రకటించిన 16% ఐఆర్‌తో పాటు మొత్తం రూ. 700 కోట్ల నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడంతో పాటు ఆదాయ వనరులను సమకూర్చుకోడానికి అనుసరించాల్సిన విధానమేంటి?, సంస్థలో అంతర్గత సమర్థతను పెంపొందించి అన్ని విధాలుగా స్వయం సమృద్ధి సాధించేలా, సొంతకాళ్ళమీద నిలబడేలా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి?, ఇప్పటివరకు మొత్తం పోగుబడిన దాదా పు రూ.3000 కోట్లను క్రమంగా ఏ విధంగా తగ్గించవచ్చు?, ఆర్‌టిసి ఎదుర్కొంటున్న అన్ని సవాళ్ళ ను, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వస్తున్న నష్టాలను అధిగమించడం ఎలా?… అనే నాలుగు అంశాలపై ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుందని మంత్రి ఒకరు తెలిపారు. అయితే ఈ నిపుణుల కమిటీలో ఎవరెవరు ఉం టారనేది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, నలుగురైదుగురితో ఈ కమిటీ ఉండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. ఏ రాష్ట్రంలో అయినప్పటికీ ఆర్‌టిసి అనే సంస్థ ప్రజలకు రవాణా సేవలందించే దృక్పథంతోనే ఉంటుందని, దీనికి వ్యాపార దృక్పథం ఉండదని, అయినప్పటికీ ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండేలా తీర్చిదిద్దాలనేదే ముఖ్యమంత్రి ఉద్దేశమని వ్యాఖ్యానించారు. ఈ వారంలోనే కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంద ని, ముఖ్యమంత్రే తుది నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల తరహాలో వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించే అంశం గురించి రవాణాశాఖ ఉన్నతాధికా రి ఒకరు మాట్లాడుతూ దీర్ఘకాలిక దృష్టితో చూసినప్పుడు ఈ ప్రక్రియ అనివార్యం కావచ్చునేమోగానీ, ప్రస్తుతానికి ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించడంతో ఇప్పటికిప్పుడు అలాంటి విధాన నిర్ణ యం ఉండకపోవచ్చునని వ్యాఖ్యానించారు. అయి తే ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ వేర్వేరు కార్పొరేషన్లుగా పనిచేస్తున్న విధానాలపై ప్రభుత్వం పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆర్‌టిసి ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం 16% ఐఆర్ ఇవ్వడానికి అంగీకారం కుదిరి సానుకూలత కనిపించినప్పటికీ అదే సమయంలో ప్రత్యా మ్నాయంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం సమాంతరం గా తగిన ఏర్పాట్లు చేసుకుందని, అదే తరహాలో వేర్వేరు కార్పొరేషన్లుగా ఏర్పాటుచేసే ఆలోచన నోట్ రూపంలో సిద్ధంగానే ఉందని వివరించారు.
తమిళనాట నష్టాల్లో ఎనిమిది కార్పొరేషన్లు : తమిళనాట ప్రారంభంలో చేరన్, చోళన్, పాండ్యన్, పల్లవన్ అనే నాలుగు పేర్లతో వేర్వేరు రవాణా సంస్థలు ఉండేవి. 1970వ దశకం తర్వాత కొన్ని సంస్థల విధివిధానాలు మారడంతో పాటు జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత 1990వ దశకంలో మరిన్ని మార్పులకు గురై ప్రస్తుతం రాజధాని చెన్నయ్ నగరం కేంద్రంగా రెండు కార్పొరేషన్లు ఉన్నాయి. విల్లుపురం, సేలం, కోయంబత్తూరు, కుంభకోణం, మదురై, తిరునల్వేలి కేంద్రాలుగా మరో ఆరు కార్పొరేషన్లు పనిచేస్తున్నాయి. అన్ని రవాణా సంస్థల్లో కలిపి 22,533 బస్సులు రోజూ 20776 సర్వీసుల ద్వారా సగటున 92.55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. మొత్తం 321 డిపోలలో 1.43 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. రోజుకు సగటున రూ. 25.37 కోట్ల చొప్పున (సంవత్సరానికి రూ. 9260 కోట్లు) ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ ఇందులో 51.4% ఉద్యోగుల, కార్మికుల వేతనాలకే వెచ్చించాల్సి వస్తోంది. మరో 28.74% డీజిల్‌కు ఖర్చు చేయాల్సి వస్తోంది. నష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోడానికి, ఏటా డీజిల్ ధరల పెరుగుదలతో పాటు సిబ్బంది వేతనాలు కూడా పెరగడంతో గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 2500 కోట్లను వన్ టైమ్ (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్) సాయం కింద అందించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 900 కోట్లను ఇవ్వనున్నట్లు పేర్కొనింది. దీనికి తోడు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1364 కోట్లను డీజిల్, కన్సెషన్ సబ్సిడీ కింద అందజేసింది. సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న బకాయిల్లో రూ. 3000 కోట్లను షేర్ కాపిటల్ కింద మార్పు చేయడానికి ప్రస్తుత బడ్జెట్‌లో హామీ ఇచ్చింది. దాదాపుగా ఎనిమిది రవాణా సంస్థలూ అప్పుల్లోనే కూరుకుపోయాయి. 201117 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం షేర్ కాపిటల్, లోన్లు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, గ్రాంట్లు, రీఇంబర్స్‌మెంట్ తదితర రూపాల్లో రూ. 7912 కోట్లను ఈ సంస్థలకు అందజేసింది. 2012 నుంచి డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతూ ఉండడంతో ప్రతీ ఏటా సబ్సిడీ కింద ప్రభుత్వం 2017 వరకు ఐదేళ్ళ కాలానికి రూ. 2,173 కోట్లను అందజేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 800 కోట్లను ఇచ్చింది. 201516 నాటికి అన్ని రవాణా సంస్థల్లో సుమారు రూ. 16,145 కోట్ల మేర నష్టాలు పోగుబడ్డాయని, ఇందులో చెన్నయ్ కేంద్రంగా పనిచేస్తున్న మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (ఎంటిసి) అనే సంస్థ వాటా సుమారు రూ. 2,502 కోట్లు. కేవలం నగర సర్వీసులను మాత్రమే నిర్వహిస్తున్న ఎంటిసిలో సుమారు పాతిక వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సుమారు నాలుగువేల బస్సులు 3685 సర్వీసులను (845 రూట్లు) నిర్వహిస్తోంది. చెన్నయ్ కేంద్రంగానే ఏర్పడిన ‘స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ తమిళనాడు లిమిటెడ్’ కేవలం దూర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు మాత్రమే 1250 బస్సుల ద్వారా 664 సర్వీసులను నడుపుతోంది. ఇక విల్లుపురం, కుంభకోణం, మదురై, సేలం, తిరునల్వేలి, కోయంబత్తూరు కేంద్రాలుగా ఏర్పడిన కార్పొరేషన్లు వాటి చుట్టూ ఉన్న నాలుగైదు జిల్లాల పరిధిలో సర్వీసులను నడుపుతున్నాయి. పశ్చిమకనుమల్లో ఎక్కువగా ఘాట్‌రోడ్లు ఉండడంతో సర్వీసుల సంఖ్య, తిరిగే పరిధి తక్కువగా ఉంటోంది.
కర్నాటక రవాణా సంస్థల్లోనూ నష్టాలే : కర్నాటకలో నాలుగు రవాణా సంస్థలూ నష్టాల్లోనే ఉన్నాయి. బెంగుళూరు నగరంలో సిటీ సర్వీసులను నిర్వహిస్తున్న బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ మూడేళ్ళ వరుస నష్టాల తర్వాత 2015-16లో స్వల్పంగా లాభాలు ఆర్జించినా 201617లో మళ్ళీ రూ. 260.91 కోట్ల నష్టాల్లోకే పోయింది. 201213లో రూ. 147.95 కోట్లు, 201314లో రూ. 147.59 కోట్లు, 201415లో రూ. 64.90 కోట్లు చొప్పున నష్టాలపాలవ్వగా 201516లో మాత్రం రూ. 13.73 కోట్ల మేరకు లాభాలు ఆర్జించింది. రూ. 2207 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా ఖర్చులు మాత్రం స్వల్పంగా తగ్గించుకుని రూ. 2193కు చేర్చడంతో రూ. 13.72 కోట్ల మేర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికే మళ్ళీ రూ. 51.98 కోట్ల నష్టాల్ని చవిచూసింది. ఇక ఈశాన్య కర్నాటక ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్, వాయువ్య కార్పొరేషన్, దూరప్రాంత సర్వీసులను నిర్వహి,చే కర్నాటక ఆర్‌టిసి సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయి. ఈ మూడు సంస్థల్లో 17,930 బస్సులుండగా (179 డిపోలు) 82,573 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కెఎస్‌ఆర్‌టిసి రోజుకు రూ. 7.50 కోట్ల మేర ప్రయాణీకుల టిక్కెట్ల నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తుండగా వాయువ్య కార్పొరేషన్ రూ. 4.09 కోట్లు, ఈశాన్య కార్పొరేషన్ రూ. 3.62 కోట్ల చొప్పున (2016-17) ఆర్జిస్తున్నాయి. బిఎంటిసిలో మాత్రం గరిష్టంగా 6407 బస్సులు ఉండడంతో 35,554 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. బిఎంటిసి పరిధిలో నష్టాలు రావడానికి ప్రధాన కారణంగా ఇటీవలి కాలంలో క్యాబ్ సర్వీసులు పెరిగిపోవడం, స్వల్పంగా మెట్రోరైల్ సర్వీసులు కారణమని ఆ సంస్థ విశ్లేషించింది. ఒకే సంస్థగా పనిచేస్తున్నా, వేర్వేరు కార్పొరేషన్లుగా పనిచేస్తున్నా నష్టాలు మాత్రం తప్పడంలేదు. తమిళనాట ఏకంగా 51.4% ఆదాయం సిబ్బంది వేతనాలకే ఖర్చవుతుండడం గమనార్హం. దీనికి తోడు ఏటా పదవీ విరమణ చేస్తున్నవారికి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పింఛను తదితరాలు కూడా పెరుగుతూ ఉన్నట్లు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి.

Comments

comments