Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

దళితులకు , గిరిజనులకు అండగా కమిషన్

Commission Supporting  for Dalits and tribals

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ డా. ఎర్రోల్ల శ్రీనివాస్

మనతెలంగాణ/గద్వాల న్యూటౌన్: పౌర హక్కుల చట్టం పిసిఆర్ 1955 ఎస్సి, ఎస్టీల అత్యాచారల నివారణ చట్టం రెండు చట్టాల పూర్తిస్థాయిలో అ మలు అయి తాండలు, గూడలు, వరకు తీసుకునివెళ్ళగలిగితే ఎస్సీ,ఎస్టిలకు భరోసా వారికి అండగా నిలిచినవాళ్ళమవుతామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ డా. ఎర్రోల్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో పిసిఆర్ ,పి ఒఎ యాక్ట్ అమలుపై గద్వాల వనపర్తి జిల్లాల పో లీస్ ఉన్నధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు ఆయన ముఖ్యఅతిధిగా హాజరైయ్యా రు. ఈసందర్బంగా ఆ యన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పిఆర్‌సి పిఒఎ యాక్ట్‌ల పకడ్బందిగా అమ లు జరిగితేనే దళితులు ఆత్మగౌరవంతో బతుకుతారని ఉద్ఘాటించారు. ప్రతి నెల 30వతేదిన పౌరహక్కుల దినం నిర్వహంచాలని ,అధేవిధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమీటి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జోగులాంబ గద్వాల ఎస్సీకి ఒక యస్‌యంయస్ పంపితేనే వెంటనే స్పందించి వనపర్తి గద్వాల పోలీస్, ఫ్రెండ్లి పోలీస్ అధికారులకు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గద్వాల వనపర్తి జి ల్లాల్లో  గత రెండు నెలల నుండి పౌరహక్కుల దినం జరపటం జరిగిందని అధికారులు కమీషన్ ఆదేశాలను సాధించి పాటించటం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి మాట్లాడు తూ  ఎస్సీ,ఎస్టీలపై అత్యాచారాలు జరిగినప్పుడు పోలీస్‌శాఖ ఏవిధంగా ద ర్యాప్తు చేయాలి, బాధితులకు ఖచ్చితమైన న్యాయము వెంటనే జరిగేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి వాటికి చట్టన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాలను పుస్తకాలు సమాకూర్చినందుకు కమీషన్ చైర్మన్ ధన్యావాదాలు తెలిపారు. గద్వాల వనపర్తి జిల్లాలో పిసిఆర్  పిఓఎ  యాక్టులను వందశాతం అమలు చేసేందుకు కృషి చేస్తామని కమీషన్ కు భరోసా క ల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప రిషత్ చై ర్మ న్ భాస్కర్ , రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యులు ఆంజనేయులు గౌడు, కమీసన్ సభ్యులు సు ంకపాక దేవయ్య, జిల్లా సంయుక్త కలెక్టర్ డి,వేణుగోపాల్, అడిషనల్ ఎస్పీ భాస్కర్ ,జిల్లా హస్టల్ సంక్షేమ అధికారి రాములు, ఇరువర్గాలు జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Comments

comments