Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

రైతులకు నిరాశే..

Computers Not Working In Andra Bank In Siddipet
దుబ్బాకః రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పెట్టుబడి సాయం చెక్కులను నగదుగా మార్చుకోవడానికి వచ్చిన రైతులకు ఒక్కసారిగా కంప్యూటర్లు మొరాయించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.బ్యాంక్ లావాదేవిలు లేక పోవడంతో ఎంతో దూరం నుండి వచ్చిన వారికి తీవ్ర నిరాశే ఏర్పడింది. దీంతో అయోమయంలో పడ్డ రైతులు నిరాశతో కొందరు వెనుతిరిగి పోగా, మరి కొందరు అక్కడే పడిగాపులు కాశారు. ముసలిముతక మనుషులతో పాటు వికలాంగులు బాలింతలు ఎక్కడికి వెళ్ళలేక బ్యాంక్‌లోనే సేద తీరారు. ప్రతి రోజు బ్యాంక్ చుట్టు తిరిగి వేసారి పోతున్నామని, ఒక్కొసారి డబ్బులు అయిపోయాయని, కంప్యూటర్ మొరాయిస్తున్నట్లు చెప్పుకుంటు రోజలు గడుపుతున్నారే తప్ప పెట్టుబడి సాయం మాత్రం అందడం లేదని భాదితులు వాపోయారు. ఇకనైన తమ గోడు అర్ధం చేసుకుని బ్యాంక్ సౌకర్యాలు మెరుగుపరిచి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు తమ వేధనను అధికారులకు విన్నవిస్తున్నారు.

సయ్యద్ జహీర్ రైతు, హబ్షీపూర్
మాది మండంలోని హభ్షీపూర్ గ్రామం. నేను ఉపాధి కోసం సిద్దిపేటలో ఉంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా నాకు చెక్కును అందజేశారు. అది నగదుగా మార్చుకునేందుకు రెండు రోజులుగా బ్యాంక్ చుట్టు తిరుగుతున్న, ఏవేవో కారణాలతో బ్యాంక్ లో లావాదేవిలు నిల్చి పోతున్నాయి. అంత దూరం నుండి వచ్చుకుంటు పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందన్నారు. దీంతో ఉపాధి పనులు కూడ నిలిచి పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రేణుక పెద్దగుండవెళ్ళి
మాది పెద్దగుండవెళ్ళి చెక్కును నగదుగా మార్చుకోవడానికి బ్యాంక్‌కు వచ్చాను. కానీ ఇక్కడ మాకు డబ్బులు ఇవ్వడం లేదు. కంప్యూటర్ పని చేయడం లేదని చెప్తున్నారు. తొందరగా పని చూసుకుని వెళ్దామని పొద్దుగాలనే వచ్చాం. కానీ ఎండల్లో తిరిగి వెళ్ళాలంటే భాదేస్తుంది. నాతో పాటు నా పసి పాపను తీసుకువచ్చాను. ఎండకు తీవ్రతకు అలమటిస్తుంది. మాగోడు ఎవరు పట్టించుకునేది అంటు ఆమె వాపోయారు.

Comments

comments