Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ నేతలకు ఓటమి భయం

 Congress leaders are afraid of defeat

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : కాంగ్రెస్ నేతలకు ఓటమి భయం పట్టు కుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జీ కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాల యంలో 23 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధులను 8.15 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసి అనంతరం మీడియా సమావేశంలో మా ట్లాడారు.  17న బత్తాయి మార్కెట్‌ను ప్రారం భించేందుకు రాష్ట్ర భారీ నీటి పారుదల, మా ర్కెటింగ్ శాఖామంత్రి హరీశ్‌రావు బత్తా యి మార్కెట్ ప్రారంభోత్సవానికి  రానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలకు ఏ ఒక్కరికి డిపాజిట్ దక్కదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సిఎల్‌పి నేత జానారెడ్డి, ఉప నేత కోమటిరెడ్డి, పిసిసి అధ్యక్షులు ఉ త్తమ్‌కుమార్‌రెడ్డిలు అబద్దాలతో ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్ర యత్నిస్తున్నారని, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వరద కాల్వను పూర్తి చేయకుండా జానారెడ్డి సాగర్ ఆయకట్టు రైతులను మోసం చేస్తూ కాలయాపన చేశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరద కాల్వను పూర్తి చేసి 80 వేల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అధికారంలోకి వస్తే 2 లక్షల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అమలు కాని హామీలను ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇప్పటికే జిల్లా కేంద్రాసుపత్రి ఉన్నందున మేడికల్ కళాశాలను ఆసుపత్రి ఆవరణలో  ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయక త్వంలో దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తుందని, కాంగ్రెస్‌లో ఉన్న నాయకులంతా సిఎం అభ్యర్థులేనని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి పరిపాలనలో నల్లగొండ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య అక్కడే పేరుకుపోయి ఉందని, ఏనాడు అభివృద్ధి గురించి ఆలోచించని వ్యక్తి కోమటిరెడ్డి అని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలో ఐటి మంత్రిగా కొనసాగిన కోమటిరెడ్డి దొంగ చదువుతో ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేశారని చెప్పారు. 156 కోట్ల రూపాయలతో నల్లగొండ మున్సిపాలిటీని ఆధునిక కాలానికి అనుగుణంగా సుందరీకరించనున్నట్లు వివరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు మాని రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చేందుకు సహాకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు బకరం వెంకన్న, నాయకులు జమాల్ ఖాద్రి, అభిమ

Comments

comments