Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

స్థానిక సమస్యలపై కాంగ్రెస్ ‘నజర్’

Congress Leaders Speech Against TRS Party

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : స్థానికి సమస్యలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను వెలికితీసేందుకు, ప్రతి ఇంటికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ‘మన ఇంటికి మన రాజేందర్ అన్న’ పేరుతో ప్రారంభించిన పాదయాత్ర గురువారం 30వ డివిజన్ పరిధిలో కొనసాగింది. స్థానికంగా సమస్యలను అధ్యయనం చేస్తూ సాగిన పాదయాత్ర బృందానికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఇంటింటిని పలకరించి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంతో స్థానికులు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తాగునీటి సమస్య తలెత్తుతుందని, ఇక్కడ ఉన్నటువంటి బోర్లు సరిగా పని చేయడం లేదని పాదయాత్ర బృందానికి తెలిపారు. మరి కొన్ని చోట్ల వీధి లైట్లు సరిగా పని చేయడం, మరో వీధిలో మోరీల నిర్మాణం కోసం గుంతలు తవ్వి మూడు నెలలు గడిచినప్పటికీ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ప్రమాదాలు ఏర్పడుతున్నాయన్నారు. 30వ డివిజన్‌లో వృద్ధులకు పెన్షన్లు సరిగా అందడం లేదని, అధికారుల చుట్టూ, స్థానిక కార్పొరేటర్ చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా ఫలితం లేకుండా పోతుందని రాజవ్వ అనే మహిళా ఆవేదన వ్యక్తం చేసినట్లు పాదయాత్ర బృదం తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ… క్లీన్ సిటీ.. గ్రీన్ సిటీ అంటూ అవార్డులు తీసుకుంటున్న మేయర్, కార్పొరేటరు స్థానిక సమస్యలు పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలోని పలు వీధులలో ఎక్కడి చెత్త అక్కడే ఉందని పారిశుద్ధ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పక్షం నేతలకు అవార్డుల మీదున్న ప్రేమ ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ మద్దతుదారులున్న గల్లీలలో 12 ఫీట్ల రోడ్లు వేయడం ప్రారంభించి ఆరు పీట్లకు కుదించారని అన్నారు. ప్రభుత్వాధినేతలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని, పర్సెంటీజీల మీదు దృష్టి పెడుతున్నారే తప్ప ప్రజల అవసరాలు తీర్చడంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పర్సెంటేజీలు అందని ప్రాంతాలలో అభివృద్ధిని కుంటుపరుస్తున్నారని ఆవేదన చెందారు. పన్నుల భారాన్ని అధికంగా మోపుతున్నారని తెలిపారు. వెస్ట్ ఎల్‌ఆర్‌ఎస్ కట్టినప్పటికీ కూడా వెకేట్ ల్యాండ్ ట్యాక్స్ పేరుతో పన్నులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్రలో అనేక సమస్యలు బయటపడుతున్నాయని, ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడతున్నారని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యక్షుడు అంబేద్కర్ రాజు, మాజీ కార్పొరేటర్లు హర్మకొండ రాజేందర్, నసీం జహాన్, నాయిని రాజేందర్‌రెడ్డి కూతురు నాయిని శ్రీగోదారెడ్డి, నాయకులు బొక్క సుధాకర్, శ్యాంసన్, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, బత్తిని శ్రీనివాసరావు, ఈ.వి శ్రీనివాస్‌రావు, టిపిసిసి అధికార ప్రతినిధి కూచన రవళి, కార్పొరేటర్లు వేము

Comments

comments