Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఆర్‌బిఐ నిర్ణయం సరైందే

imf

బ్యాంకింగ్ సంక్షోభాన్ని పరిష్కరిస్తే పెట్టుబడులకు ఊతం : ఐఎంఎఫ్

వాషింగ్టన్ : భారత్‌లో సంక్షోభంలో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని ఆదుకోవడం అత్యంత ప్రధానమైందని ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్యనిధి) పేర్కొంది. పెట్టుబడులకు ఊతం అందించేందుకు, సమ్మిళిత వృద్ధి ఎజెండా కోసం బ్యాంకింగ్ రంగ సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి గెర్రీ రైస్ అన్నారు. భారత్ వృద్ధి రేటుకు దోహదం చేసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల సమస్యను పరిష్కరించాలని అన్నారు. అలాగే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రెపో రేట్ల పెంపును ఐఎంఎఫ్ స్వాగతించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బిఐ వడ్డీరేట్లు పెంచడం సరైనదేనని పేర్కొంది. ద్రవ్యోల్బణం, చమురు ధరలు పెరుగుతుండటం, ఇతర దేశీయ పరిణామాల నేపథ్యంలో ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయం సరైనదే అని గెర్రీ రైస్ అన్నారు. బుధవారం నాడు ద్రవ్యపరపతి సమీక్షలో ఆర్‌బిఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడం హర్షించదగినదే అని అన్నారు. దీంతో రెపో రేటు 6 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది. ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచడం నాలుగున్నరేళ్లలో ఇదే తొలిసారి.. ఇంతకుముందు 2014 జనవరిలో రెపోరేటును 8 శాతానికి పెంచింది. ఆ తర్వాత రేట్లను తగ్గించడం లేదా యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి పరిణామాల కారణంగా వడ్డీ రేట్లను పెంచాలని ఆర్‌బిఐ నిర్ణయించింది.

Comments

comments