Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఖాకీల్లో కళంకితులు

Corrupt police In Police Departmaent In Telangana

అవినీతి మత్తులో మునిగిపోయిన పోలీసు సిబ్బంది ఆ శాఖకు చెడ్డపేరు తెచ్చిపెడుతున్నారు. రాష్ట్ర ఆవిర్బావ అనంతరం ప్రభుత్వం పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు విశేష సేవలందించే దిశగా చర్యలు చేపట్టింది. జీతభత్యాలను ఊహించని రీతిలో పెంచడమే గాక నూతన వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. స్నేహాపూర్వక పోలీసింగ్‌ను ప్రజలకు అందించే దిశగా అనేక చర్యలు చేపడుతూ వస్తోంది. అయినప్పటికి సిబ్బంది పనితీరులో మార్పు రాకపోవడంతో రాష్ట్ర డిజిపి మహేంధర్‌రెడ్డి సరికొత్త ఆలోచనతో పోలీసు శాఖకు చికిత్స చేసేందుకు ఊహించని రీతిలో చర్యలు చేపట్టారు.   ఇందులో భాగంగా ఉభయ జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లల్లో విధులు నిర్వహిస్తూ మామూళ్ల వసూళ్లకు పాల్పడుతున్న అవినీతి పరుల జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాలో 45 మంది కళంకితులు ఉండగా నిజామాబాద్ జిల్లాలో 29, కామారెడ్డిలో 16 మంది పేర్లను వెల్లడించడంతో పోలీస్ శాఖలో అలజడి మొదలైంది. వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతలను ఆయా జిల్లాల పోలీస్ కమిషనర్, ఎస్పీలకు అప్పజెప్పారు. మరోసారి వారి అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి ఎఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేయాలని డిజిపి ఆదేశాలు జారీ చేశారు.

మనతెలంగాణ/ నిజామాబాద్‌క్రైం: అవినీతి మత్తులో మునిగిపోయిన పోలీసు సిబ్బంది ఆ శాఖకు చెడ్డపేరు తెచ్చిపెడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ప్రభుత్వం పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు విశేష సేవలందించే దిశగా చర్యలు చేపట్టింది. జీతభత్యాలను ఊహించని రీతిలో పెంచడమే గాక నూతన వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. స్నేహపూర్వక పోలీసింగ్‌ను ప్రజలకు అందించే దిశగా అనేక చర్యలు చేపడుతూ వస్తోంది. అయినప్పటికీ సిబ్బంది పనితీరులో మార్పు రాకపోవడంతో రాష్ట్ర డిజిపి మహేంధర్‌రెడ్డి సరికొత్త ఆలోచనతో పోలీసు శాఖకు చికిత్స చేసేందుకు ఊహించని రీతిలో చర్యలు చేపట్టారు. పోలీస్‌స్టేషన్‌ల వారీగా జరుగుతున్నా అవినీతిపై కన్నేసి ఉంచారు. ఐడి పార్టీ పోలీసుల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి వారి కదలికలపై నిఘా పెంచారు. నెలనెల మామూళ్ల వసూళ్లపై దృష్టి సారించి ఆ సిబ్బంది దుందుడుకు చర్యలకు ముక్కుతాడు బిగించేందుకు సిద్ధ్దం చేశారు. సంస్కరణల్లో భాగంగా ఐడి పార్టీ వ్యవస్థకు స్వస్తి పలుకగా ఆ సిబ్బందిదే వివిధ పోలీస్‌స్టేషన్లలో హవా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఉభయ జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లల్లో విధులు నిర్వహిస్తూ మామూళ్ల వసూళ్లకు పాల్పడుతున్న అవినీతి పరుల జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాలో 45మంది కళంకితులు ఉండగా నిజామాబాద్ జిల్లాలో 29, కామారెడ్డిలో 16 మంది పేర్లను వెల్లడించడంతో పోలీస్ శాఖలో అలజడి మొదలైంది. వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతలను ఆయా జిల్లాల పోలీస్ కమిషనర్, ఎస్పీలకు అప్పజెప్పారు. మరోసారి వారి అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి ఎఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేయాలని డిజిపి ఆదేశాలు జారీ చేశారు.
* పోలీసు అధికారుల్లో ఆందోళన ః
సిబ్బంది విచారణతో తమ అవినీతి బహిర్గతమవుతుందని ఎస్సై, ఆ పైస్థాయి అధికారుల్లో ఆందోళన మొదలైంది. కేసుల విచారణలో నేరుగా మామూళ్లు తీసుకోని అధికారులు నమ్మకస్తులుగా ఉన్న సిబ్బందిని వసూళ్లకు పురమాయిస్తుంటారు. ఇదే రివాజు జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. విచారణ మొదలైతే తమ చిట్టా విప్పుతారని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కేవలం సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభించదని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజల నుండి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు పోలీసు అధికారులు భయాందోళనలతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

* అధికారుల కనుసన్నల్లోనే వసూళ్ల పర్వం ః
అధికారుల కనుసన్నలతోనే తాము వసూళ్లకు పాల్పడాల్సి వచ్చిందని పలువురు కళంకిత సిబ్బంది వివరణ ఇచ్చారు. కేసుల్లో ఇంత మొత్తంలో వసూలు చేయాలని అధికారి సూచిస్తేనే ఆ మొత్తాన్ని వసూళ్లు చేయాల్సి వస్తుందని, లేదంటే విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను ఎదురించి విధులు నిర్వహించలేని పరిస్థితి పోలీసు శాఖలో ఉందని, ఇతర శాఖల్లో ఈ తరహా అజమాయిషీ ఉండదని చెప్పుకొచ్చారు. ఈ జాబితాలో కేవలం సిబ్బందినే బాధ్యులను చేశారని, అధికారుల అవినీతిని బయటపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
* మామూళ్లు వసూలు చేస్తున్న సిబ్బంది జాబితా ః
జగదీష్ (ఎడపల్లి), అశోక్, అంబరీష్‌గౌడ్ (బోధన్ ఎసిపి కార్యాలయం), ఎజాజ్, వంశీ (బోధన్), శౌకత్ అలీ (ఎడపల్లి), లాల్‌జీ, గజేంధర్ (కోటగిరి), రాజారాం (రుద్రూర్), బాబురావు, శ్రీనివాస్ (వర్ని), గఫార్ (నిజామాబాద్‌రూరల్), కిరణ్‌కుమార్, కార్తీక్ (డిచపల్లి), లింబాద్రి (మోపాల్), రాజేశ్వర్ ( జక్రాన్‌పల్లి), మోహన్‌గౌడ్ (ధర్పల్లి), చంద్రయ్య (సిరికొండ), జితేంధర్ (బాల్కొండ), భూమయ్య( ముప్కాల్), ముత్యంరావు (మెండోరా), మల్లేశం, రమేష్ (ఆర్మూర్), రాజేశ్వర్‌గౌడ్, సాయిలు (నందిపేట), ఫీర్‌చంద్, అర్జున్‌రావు (మాక్లూర్), కార్తీక్(భీంగల్), గోపి (వేల్పూర్).
కామారెడ్డి సిబ్బంది జాబితా ః
జనార్ధన్‌రెడ్డి, వస్సి (బాన్సువాడ), రాంచందర్ (బీర్కూర్), అబ్బులు, కరుణకర్ (బిచ్కుంద), సాగర్‌గౌడ్ (జుక్కల్), రాజ్‌కుమార్ (మద్నూర్), వెంకగౌడ్ (నిజాంసాగర్), బాలయ్య (పిట్లం), సలీం (తాడ్వాయి), ప్రకాష్ (సదాశివనగర్ ), వసంత్ (గాంధారి), నరేష్ (రామారెడ్డి), మోజం (నాగిరెడ్డిపేట), సిద్దిరాములు (బీబీపేట), రాములు (కామారెడ్డి).

Comments

comments