Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

క్కొ..క్కొ..క్కో..మల్లన్న

Corruption In Traffic Police Station In Suryapet

మన తెలంగాణ/సూర్యాపేట : జిల్లాలో పోలీసుల అవినీతికి, ఆర్భాటాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయినప్పటికీ కింది స్థాయి ఉద్యోగులపై జులూం చూ పి స్తూనే ఉన్నారు. దీనితో మొన్నటి మొన్న ట్రాఫిక్ విభా గంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ దామోదర్‌రెడ్డి పై అధి కారి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొని తన ప్రా ణాల మీదకు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అదే శాఖలో పనిచేస్తూ రెండవ స్థానం కలిగిన ఓ ఎస్సై తన కింది స్థాయి హోంగార్డును ఓ విషయంలో దుర్భాష లాడ డంతో హోం గార్డు తన ఇంట్లో ఆత్మహత్యా ప్రయత్నం చే యబోగా కుటుంబ సభ్యులు, తోటి సహచరులు అ డ్డుకో వడంతో అతడు ప్రాణా పరిస్థితి నుండి బయటపడ్డ పరి స్థితి జిల్లా కేంద్రంలో నెలకొంది. గత రెండు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖలో అవినీతి ఉద్యోగుల చిట్టాను ఆ శాఖ విడుదల చేసింది. అందులో సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు 40 మంది ఉండి రా ష్ట్రంలోనే అవినీతి ఉద్యోగులుగా జిల్లా మూ ట గట్టుకున్న సంగతి సోషల్ మీడి యా లో హల్‌చల్ చేస్తోంది. రాచకొండ కమిషనర్‌శాఖ రూపు రేఖలను మారుస్తాననిచెప్పినప్పటికీ అవినీతి పోలీసుల నివేదిక బ య టకు పొక్కడంతో కల కలం సృష్టిస్తుంది. ఇంత తత ంగం జరుగుతున్నప్పటికీశాఖలోని కొంత మంది ఉద్యో గుల తీరులో ఎటు వంటి మా ర్పు కన్పించడం లేదు. ముఖ్య ంగా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ విభాగంలో వసూళ్లలో ప్రత్యేక రే టు మాత్రం కలిగి ఉందని చెప్ప చ్చు.

ప్రధాన కూడళ్లలోనూ, సీసీ కెమెరాలు లేని ప్రదేశంలోనో, సదరు ఎ స్సైతో పాటు ఏఎస్సై, దం దాలు కొనసాగిస్తున్నట్లు వాహన చోదకులు బాహటంగా చెప్పుకుంటున్నారు. దీనితో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ మూడు వాహనాలు, ఆరు రకాల వసూళ్లతో అ ఉ ద్యోగులు జేబులు నింపుకుంటు న్నా రు. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ట్రాఫిక్ ని యమ నిబ ంధనలకు వ్యతిరేకంగా వెళ్లే వాహన చోదకుల నుండి తమ బాధ్యతలను మర్చి శాఖా పేరుతో వసూ ళ్లు చేసిన డబ్బులతో తమ జేబులను నింపుకోవడం వారికి వెన్నతో విద్యలాగ కన్పిస్తుంది. సదరు ఎస్సై సంవత్సర క్రితం ట్రాఫిక్ విభాగంలోకి వచ్చిన నాటి నుండి తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నాడనేది విశ్వసనీయ సమాచారం. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహన చోదకులకు స్లిప్పులను, వాహ నాల తాళం చెవిలను స్టేషన్‌లో అప్పగించకుండా తన జేబులోనే పెట్టుకొని కంప్యూటర్‌లో నమోదు చేయకుండా, కోర్టు అప్పగించకుండా మరుసటి రోజు వారి వద్ద నుండి ఎంతో కొంత డబ్బు లాగి చిన్నపాటి రుసుముతో వారిని ఒదిలేస్తున్నట్లు వాహన చోదకులు బాహటంగానే చెప్పుకుంటున్నారు. సుమారు గత పది రోజుల క్రితం ఇలాంటి ఓ ద్విచక్ర వాహనంపై అభిమానం కలిగిన జాతీయ పార్టీకి చెందిన ఓ రాష్ట్ర నాయకుని ఫొటో కలిగిన స్టిక్కర్‌ను తన బండిపై ఉన్న దానికి అట్టి ఎస్సై చించడంతో ఆగ్రహం చెందిన నాయకులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనితో ఎస్పీ సదరు ఎస్సైను గట్టిగానే మందలించినట్లు సమాచారం.
ఎస్సై దుర్భాషలతో ఆత్మహత్య ప్రయత్నం చేసిన హోంగార్డు
కొంత కాలంగా సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మారిపెల్లి సైదులును బుధవారం సాయంత్రం ట్రాఫిక్ ఎస్సై దుర్భాషలాడినట్లు బాధితుడు స్టేషన్‌లోనే పేర్కొన్నారు. తాను సీనియర్‌ని.. తను చెప్పిందే వేదమని… తన సీనియారిటిని ఎవరూ ప్రశ్నించే అధికారం లేదని డ్రంక్ అండ్ డ్రైవ్ స్లిప్పులను ప్రతి రోజులాగే ఆ రోజు కూడా తన జేబులోనే సదరు ఎస్సై పెట్టుకున్నాడు. అట్టి వాహన చోదకులను మరుసటి రోజు కోర్టుకు పంపించాల్సి ఉండగా సైదులుకు అట్టి స్లిప్పులను తీసుకోవాలని ట్రాఫిక్ విభాగంలో పర్మినెంట్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మరో ఎస్సై సూచించాడు. దీనితో సైదులు సదరు ఎస్సైని స్లిప్పులు అడగగా నానా దుర్భాషలాడాడు. దీనితో కలత చెందిన హోం గార్డు సైదులు తన ఇంటికి ఎలుకల మందు డబ్బాతో ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే శాఖ సిబ్బందికి సమాచారం అందించినట్లు కాలనీ వాసులు చెప్తున్నారు.
ఇప్పటికే అవినీతిలో సూర్యాపేట జిల్లా మొదటి స్థానంలో ఉంటే ఇలాంటి అధికారులను మార్చేదెవరు…? అంతమొందించేదేప్పుడు…? ప్రభుత్వ ఖజానా నిండేదెలా..? సామాన్యుడి జేబు బాదుడు ఆపేదెవరు…? అనే ప్రశ్నలతో ప్రజలు సందిస్తున్నారు. ఇలాంటి అవినీతి అధికారులపై ఇప్పటికైనా జిల్లా పోలీస్ అధికారి దృష్టి పెట్టి అంతిమొందించకపోతే జిల్లా పోలీస్ యంత్రాంగం అబాసులపాలై ఫ్రెండ్లీ పోలీసులకు బదులుగా వామ్మో పోలీస్ అని భయపడే పరిస్థితి దాపురించనుందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.

Comments

comments