Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

చిన్నారిని కారులోంచి విసిరిన దంపతులు…

Born-baby-girl

ముజఫర్ నగర్ : కన్న బిడ్డను కారులో నుంచి బయటకు విసిరేసిన దంపతులను యుపి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సార్వేర్ (26), కైసర్ దంపతులు జూన్ 6న తమకు పుట్టిన బిడ్డను ప్రయాణిస్తున్నకారులోంచి బయటకు విసిరేశారు. అయితే పసికందు రోడ్డు పక్కనే ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పసిబిడ్డను కారులో నుంచి విసిరిన వీడియో అక్కడి సిసి కెమెరాల్లో రికార్డు అయింది. సిసి పుటేజీ ఆధారంగా కారు నంబర్‌ను గుర్తించిన పోలీసులు పసికందు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దంపలిద్దరినీ విచారించగా తమకు ఫిబ్రవరిలోనే వివాహం జరిగిందని, తమకు అప్పుడే బిడ్డ పుట్టడంతో సమాజానికి ఏం చెప్పాలో అర్థం కాక ఈ పని చేశామని పోలీసుల ఎదుట తప్పున అంగీకరించారు. దీంతో ఐపిసి సెక్షన్ 317 కింద కేసు నమోదు చేసి దంపతులిద్దరినీ అరెస్ట్ చేశామని ముజఫర్ నగర్ ఎస్ఎస్ పి అనంత్ దేవ్ తెలిపారు. ప్రస్తుతం చిన్నారికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్సనందిస్తున్నారు.

Comments

comments