Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఈ గుడిసెకు ఇంటి పన్ను@ రూ.500

Cutting in Retirement pinchan
మంచిర్యాల: ఇదేదో డబుల్ బెడ్‌రూం ఇల్లు కాదు… భవనం అంతకన్నా కాదు.. ఇద్దరు వృద్ద దంపతులు తలదాచుకోవడానికి ఏర్పాటు చేసుకున్న పూరి గుడిసె… కానీ గ్రామపంచాయతీ అధికారులు మాత్రం కనీస కనికరం లేకుండా ఈ ఇంటికి ఇంటి పన్ను రూ.500లు విధించారు. వృద్ద దంపతులు చెల్లించే పరిస్థితుల్లో లేకపోయినప్పటికి వారికి వచ్చే వృద్దాప్య పించన్ డబ్బుల నుంచి కోత విధించారు. ఈ సంఘటన కొమురంభీం జిల్లా అసిఫాబాద్ జిల్లాలోని చింతలమానెపల్లి మండలం కర్జెల్లి ఎస్‌టి కాలనీలో చోటు చేసుకుంది. పంగిడి చీకటి, పంగిడి బాయక్కలు ఎస్‌టి కాలనీలో తలదాచుకునేందుకు గుడిసెను వేసుకోగా గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రం కనికరం లేకుండా ఇష్టారాజ్యంగా పన్నులు వసూలు చేస్తున్నారు. పూరి గుడిసెలకు రూ. 50 నుండి 120 రూపాయలకు నామమాత్రపు ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉండగా సదరు కార్యదర్శి మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వారికి వచ్చే పించన్ డబ్బులలో 500 రూపాయలు కోత విధించి రసీదు వారికి అందించారు. మాజీ ఎంఎల్ఎ పాల్వాయి రాజలక్ష్మి కుమారుడు యువనేత పాల్వాయి హరిష్‌బాబు బుధవారం ఎస్‌టి కాలనీని సందర్శించగా వృద్ద దంపతులు ఇంటి పన్ను రసీదు చూపి, వారి గోడును వెళ్లబోసుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇదే విధంగా వసూలు చేస్తున్నారని, వచ్చే పించన్ డబ్బులలో రూ. 500 కోత విదిస్తే, తాము ఎలా జీవనం గడుపుతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా పూరి గుడిసెకు రూ.500 ఇంటి పన్ను విధించి గ్రామపంచాయతీ కార్యదర్శి అందరిని నివ్వెర పరిచే విధంగా వ్యవహరించారు.

Comments

comments