Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

వెండి తెరపై పల్లె యువతి …

Deepthi Sunaina Dance for Rangastalam Song

ఇబ్రహీంపట్నం టౌన్: బుల్లి తెరపై అనేక మంది యువతి యువకులు నటించాలనే ఉద్ధెశంతో పల్లెను వదిలి సినిమా రంగంలో చోటు సంపాదించాలన్న కోరిక ఏంతో మంది యువతి యువకులలో ఆసక్తి ఉంది. కానీ అంత మందికి సిని పల్లకిలో ఆశలు అడియాషలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్నంగూడ గ్రామానికి చెందిన రైతు నల్లబోలు బోజిరెడ్డి ( బిజెపి జాతీయ నేత) కూతురు దీప్తి నగరంలోని మోహిదిపట్నం డిగ్రీ కళాశాలలో బిఎస్‌సి పూర్తి చేసి కళాత్మక ప్రదర్శనలో మక్కువ చూపిస్తూ తనకు తోచిన రంగాన్ని ఎంచుకొని తన నైపుణ్యతతో ” రంగస్థలం ” సినిమాలో రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ .. అంటు సాగే గ్రామీణ ప్రాంతంలో సాగే పాటకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గొల్లపల్లి సమీపంలో సొంత ఖర్చులతో   దీప్తి సునైనా సొంతంగా  స్టెప్పులు వేసి యూటూబ్‌లో అప్ లోడ్ చేసింది. తన అద్భుత ప్రదర్శనతో సుమారు 1 కోటి 20 లక్షల ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. సినిమా సాంగ్‌కు రాణి ప్రజాధారణ లభించిందంటే అతిశయోక్తి కాదు. దీంతో సినిమా హీరోలు సైతం దీప్తిని ఫాలోఅవతున్నారు. స్వయంగా సమంత సైతం దీప్తిని ఆదర్శంగా తీసుకుందని ఆమే తండ్రి నల్లబోలు బోజిరెడ్డి మీడియా ప్రతినిథులకు వివరించారు.

బిగ్‌బాస్ -2 అవకాశం లభించడం హర్షనీయం ….
మా టివి అంటెనే తెలుగు రాష్ట్రాలలో ఉర్రూత లూగించే చానల్ . ముఖ్యంగా బిగ్‌బాస్‌లో ఆమేకు సుమారు 3 గంటల పాటు అవకాశం లభించడం ఆమే తల్లి దండ్రులు సైతం ఆనంద  వ్యక్తం చేశారు. సామాజీక మాద్యమాలలో హాట్ టాపిగ్‌గా మారింది. భవిషత్త్ లో మరిన్ని పాత్రలు పోషించి ఇబ్రహీంపట్నం మండలం కర్నంగూడ గ్రామానికి మంచిపేరు తీసుకు రావాలని కోరుతున్నారు. తాజాగా ఈ మధ్యనే ఇబ్రహీంపట్నం మండలంలోని కర్నగూడ ప్రాంతానికి చెందిన మహిళ తెలుగు సినిమాలో సెకండ్ హిరోయిన్ గా  నటించిందని గుర్తు చేశారు.

Comments

comments