Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

వ్యాధుల కాలం

Disease period

వర్షాకాలంలో పొంచివున్న రోగాలు
నగరంపై దోమల దండయాత్ర
మలేరియా, డెంగీ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి8నగరవాసులను హెచ్చరిస్తున్న వైద్యులు

మన తెలంగాణ/సిటీబ్యూరో: గతేడాది వర్షాకాలంలో నగరవాసులను వ్యాధు లు వణికించాయి…ఈ ఏడాది కూడా అదే తరహాలో వ్యాధులు ప్రబలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో నగరంలోని పలు ప్రాం తాల్లో దోమలు దండయాత్ర చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని అంబర్‌పేట్, ఉప్పల్, లంగర్‌హౌజ్, బోరబం డ, యూసుఫ్‌గూడ, జియాగూడ, కార్వాన్, షేక్‌పేట్, నానక్‌రాంగూడ, మియాపూర్, లింగంపల్లి, బోయిన్‌పల్లి, బోరబండ, బాలనగర్, తార్కాక, ఉప్పల్, మౌలాలిలతో పాటు తదితర ప్రాంతాల్లో దోమల బెడద అధికమవుతోంది. గతేడాది 652
మంది డెంగీ బారిన, 704 మంది మలేరియా బారిన పడ్డారు.
పిఎఫ్

కేసులతో ప్రాణాలకు ముప్పు
మలేరియా ప్లాస్మోడియం వైవాక్స్ (పివి), ప్లాస్మోడియం ఫాల్సీ ఫారమ్(పిఎఫ్) అనేవి రెండు రకాలు ఉంటాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు దీని లక్షణాలు. ఇది మొదటి స్టేజి. దీని తీవ్రత తక్కువగా ఉంటుంది. పిఎఫ్‌కేసు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలి, జ్వరం, తల, ఒళ్లు నొప్పులు, వాంతులు లాంటివి దీని లక్షణాలు. ఇలాంటి కేసులు అరుదుగా నమోదవుతాయి. పిఎఫ్ త్వరగా గు ర్తించి వైద్యం అందించకపోతే కాలేయం, మూత్రపిండాలు, రక్తకణాలపై ప్రభావం పడుతోంది. మెదడుపై ప్రభావం పడి సిరబ్రల్ మలేరియాకు దారితీస్తుంది. మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవి ఆడ అనాఫిలస్ కల్సి ఫేసిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇవి ఎక్కువగా మురుగు కాల్వలు, చెరువులు, కుంటలు, పంట కాల్వలు, పొలాల్లో, పూల కుండీలు, టైర్లలోని నీటి నిల్వల్లో వృద్ధి చెందుతాయి. ఇవి రాత్రిళ్లు కుడతాయి. దోమ కాటుతో శరీరంలోకి ప్రవేశించిన ప్లాస్మోడియం పరాన్నజీవి ఎర్రరక్త కణాలపై దాడి చేస్తుంది. గతేడాది నగర వాసులను పీల్చి పిప్పి చేసిన మలేరియా కేసులు ఈ ఏడాది కూడా అదే తరహాలో విజృంభిస్తున్నాయి. ఈ వ్యాధుల విషయంలో అధికారులు ముందుస్తుగా చర్యలు తీసుకోలేకపోతున్నారు.

అధికారుల నిర్లక్షం…
నగరంలో దోమల నివారణ చర్యలు కరువయ్యాయి. అధికారులు నిర్లక్షం కారణంగానే నగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. కాస్తా చీకటి పడిందటే చాలు నగరవాసులను పీల్చి పిప్పిచేతున్నాయి. దోమల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోధ్యం చూస్తున్నారు. అధికారులు పట్టించుకోకపొవడంతోనే ప్రజలు డెంగీ, మలేరియా వ్యాధుల బారిన పడి ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.

పారిశుద్ధ్ద లోపం…
మురికి వాడల్లో నివసించే వారికి పారిశుద్ధ్దంపై అవగాహన లేకపోవడంతో రోగాల బారినపడుతున్నారు. అవగాహన కల్పించాల్సిన అధికారులకు కనీసం ఈ బస్తీలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పారిశుద్ధ్ద లోపం, దోమల బెరదతో మురికి వాడల్లో జీవిస్తున్న ప్రజలు డెంగీ, మలేరియా తదితర రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. అధికారులు మాత్రం ఘటనలు జరిగితే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. పలు కాలనీల్లో దోమల వల్ల రోగాలకు గురవుతున్నామని అధికారులకు, ప్రజాప్రతినిధులకు బస్తీ వాసులు విలపించిన ముందస్తుగా చర్యలు తీసుకున్న దాఖలు కనబడటంలేదు.

Comments

comments