Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలి

 Distributed Ramzan dress for poor Muslims

మన తెలంగాణ/ వికారాబాద్ రూరల్ : పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లింలు అందరిలా పండుగను ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో పేద ముస్లిములకు రంజాన్ దుస్తుల పంపిణీ కార్యక్రమం  వికారాబాద్ శాసన సభ్యుడు బి.సంజీవరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను సమాన దృష్టితో చూస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీ ప్రజల కొరకు గురుకులాలను స్థాపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పేద ముస్లిం ప్రజలు కూడా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నామన్న భావన వస్తుందన్నారు. వికారాబాద్ శాసన సభ్యుడు బి.సంజీవరావు మాట్లాడుతూ రంజాన్ పండుగను సుఖ శాంతులతో ఇంటిల్లిపాది జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పేద ముస్లిం కుటుంబాలకు మన ముఖ్య మంత్రి ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. షాదీముబారక్ ద్వారా ఆడ పిల్లల పెళ్ళిళ్ళకు చేయూతనందిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లిం కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలంటే తమ పిల్లలను బాగా చదివించాలని ఆయన కోరారు. చదువు ద్వారానే సమాజంలో ఉన్నత గౌరవం లభిస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పించకుండా ప్రభుత్వ గురుకులాలలో చేర్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మెన్ సనగారి కొండల్‌రెడ్డి, జడ్‌పిటిసి ముత్తహర్ షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు శుభప్రదపటేల్, బి.క్రిష్ణయ్య, ఎంపిడిఓ సత్తయ్య, తహశీల్దార్ చిన్నప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments