Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

కిమ్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించా: ట్రంప్‌

Donald Trump says I Invites North Korean leader Kim Jong Un to White House

సింగపూర్: సెంటోసా ద్వీపంలోని కెపెల్లా హోటల్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం ఉదయం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ… ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించానని తెలిపారు. అంతేగాక ఇకనుంచి రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే అణు నిరాయుధీకరణ దిశగా తొలి అడుగు పడిందన్నారు. రెండు దేశాల మధ్య పెద్ద సమస్యల పరిష్కారానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. అణునిరాయుధీకరణ, శాంతి స్థాపనే లక్ష్యంగా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న అవరోధాలను అధిగమిస్తామని,  ఈ చర్చలతో శాంతి దిశగా ఓ అడుగు ముందుకు పడిందని తెలిపారు.

 

Comments

comments