Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

వృద్ధ దంపతులకు డబుల్ ఇల్లు

gudise

మన తెలంగాణ వార్తకు మంత్రి కెటిఆర్ స్పందన
ఉత్తమ్ ట్వీట్‌పై ఆదేశాలు

మన తెలంగాణ/ హైదరాబాద్: ‘మన తెలంగాణ’ వార్తకు మంత్రి కెటిఆర్ స్పం దించారు. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో వృద్ధ దంపతుల పూరి గుడిసెకు రూ. 500 ఆస్తి పన్ను విధించడంపై చర్యలకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌కు మంగళవారం నాడు ట్వీట్ చేశారు. అలాగే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని, ఆసరా పెన్షన్‌ను కూడా అందజేయాలని కోరారు. “ఈ గుడిసెకు రూ.500 ఇంటి పన్ను”  శీర్షికతో ఈ నెల 7న ‘మన తెలంగాణ’ మొదటి పేజీలో వార్త ప్రచురితమైంది. పూరి పాకలో ఉన్న వృద్ధ దంపతుల ఫోటో, ఇంటి పన్ను రసీదుతో కూడిన ఈ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  టిపిసిసి ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం నాడు మంత్రి కెటిఆర్‌కు ట్వీట్ కూడా చేశారు. మంత్రి కెటిఆర్ దీనిపై స్పందించి స్థానిక పంచాయతీ కార్యదర్శి తప్పు సరిదిద్దుకునేలా చర్యలు తీసుకోవాలని కుమురం భీమ్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు.

Comments

comments