Search
Tuesday 19 June 2018
  • :
  • :

చినుకు పడితే వీధులన్ని చిత్తడి చిత్తడే…

drinage

నిడమనూరుః నిడమనూరు మండలంలోని రాజన్నగూడెం,ముప్పారం గ్రామాలల్లో మంగళవారం మధ్యాహ్నం కురిసిన మోస్తారు వర్షాలకే గ్రామంలోని వీధులన్ని చిత్తడి చిత్తడిగా తయారైయ్యాయి.ఇదే విధంగా గ్రామంలో డ్రైనేజి శుభ్ర పరచకపోవడంతో పూర్తి స్ధాయిలో డ్రైనేజిలు నిండి మురుగు నీరు  డ్రైనేజీలో పట్టక వీధుల గుండా  పారుతుంది. ముప్పారం గ్రామంలో ప్రధాన వీధిలో కనీసం డైనేజి ఏర్పాటు చేయలేదు.ఈ విషయంపై ప్రధాన వీధి ప్రజలు పంచాయితీ ,మండలస్ధాయి అధికారులకు ఫిర్యాధు చేసిన అధికారి కరుణించకపోవడంతో గ్రామాలల్లోని వీధులల్లో సీసీరోడ్లు కూడా డ్రైనేజిలా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా డ్రైనేజిల్లోని మురుగునీరు వీధుల్లో ప్రజలు వెళ్ళ డానికి కూడా వీలు కాకుండా ఆ విధంగా వీధులల్లో మురికి పారుతుంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి మండలంలోని పలు గ్రామాలల్లో పేరుకుపోయిన డ్రైనేజీ,వీధులగుండా పారుతున్న మురుగునీరుని వెంటనే తోలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

 తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అప్పటి నుంచి గ్రామాలల్లో పలుమార్లు పారిశుధ్యంపై ఏన్నో కార్యాక్రమాలు చేపట్టిన జిల్లాస్థాయి ,మండలస్థాయి అధికారులకి,గ్రామస్థాయి అధికారులు మాత్రం గ్రామాలల్లోని కొన్ని చోట్ల మాత్రమే తప్ప మిగితా గ్రామాలల్లో పట్టించుకోలేదు.

Comments

comments