Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఎంజిఎంలో పని చేయని ఈసిజి యంత్రాలు

ECG Missions Not Working MGM Hospital in Warangal
ఎంజిఎం :వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఈసిజి సేవలు పడకేశాయి. మొత్తం 16 ఈసిజి మిషన్లు ఉండగా నాలుగు మాత్రమే పని చేస్తుండడంతో రోగులకు వేగవంతమైన సేవలు చేయలేకపోతున్న పరిస్థితి నెలకొంది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకున్న నాధుడు లేకుండా పోయారు. ఉన్న నాలుగు ఈసిజి యంత్రాలను అన్ని విభాగాల అవసరాలకు వాడుతుండడంతో రోగులకు సేవలలో జాప్యం జరుగుతుంది. ఎంజిఎం ఆసుపత్రిలోని ఆరు యూనిట్లలో ఎలక్ట్రో కార్డియోగ్రఫీ(ఈసిజి) సేవలు అందుబాటులో ఉన్నాయి. చాతి, గుండె, కిడ్నికి తదితర సంబంధించిన సమస్యలతో పాటు సర్జరీ చేసే సందర్భాలలో వైదులు ఈసిజికి రిఫర్ చేస్తుంటారు. వచ్చే రిపోర్ట్ ఆధారంగా రోగి గుండె పనితీరు వేగంపై అంచనాకు వస్తారు.

ఎంజిఎంలో మొత్తం 12 మంది టెక్నిషియన్లు నాలుగు ఈసిజి యంత్రాల ద్వారా నిరంతరం రోగులకు రిపోర్టులు సిద్ధం చేసి అందిస్తున్నారు. ఈ విభాగంలో ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులు ఉండడం మిగతావారంతా అవుట్ సోర్సింగ్ సిబ్బందే. రోజూ ఎంజిఎం ఓపి క్యాజువాల్టీ, సర్జరీకి సంబంధించి సుమారు 600 మంది రోజులకు ఈసిజి సేవలు అందుతున్నాయి. అత్యవసర విభాగంలో సర్జరీలో సర్జరీ, మెడికల్ ఓపి, అర్థోపెడిక్, కార్డియాలజీ, ఐసియూ, ఎఎంసి, ఐఎంసి తదితర విభాగాలకు ఈసిజి యంత్రాలను సమకూర్చాలి. ప్రతి రోజు కేవలం ఓపికి వచ్చే 300 మంది రోగులకు ఈసిజి సేవలు అవసరమవుతూ ఉంటాయి. ఎమర్జెన్సీ రోగులకు కచ్చితమైన వైద్యం అందాలంటే ఈసిజి రిపోర్ట్ అవసరం కానీ సేవల్లో జాప్యంతో ఎంతో మంది రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
-అత్యవసర విభాగాలలో అసౌకర్యం
ప్రస్తుతం ఎంజిఎంలోని పిడియాట్రిక్, ఎంఎంసి, ఐఎంసి, ఐసిసియు, మెడికల్ వార్డు, సర్జికల్ వార్డులలో ఈసిజి పరికరాలు ఎప్పుడూ మొరాయింపు చేస్తుంటాయి. దీంతో గత్యంతరం లేక ఇతర విభాగాలలోని యంత్రాలను అన్ని విభాగాల అవసరాలకు తిప్పుతున్నారు. ఫలితంగా అత్యవసర విభాగం కార్డియాలజీ, మెడికల్ వార్డులలోని రోగులు అసౌకర్యానికి గురవుతున్నారు.
కోట్ల బడ్జెట్ ఉన్నా
ఈసిజి యంత్రాలు మూలన పడిన విషయాన్ని టెక్నిషియన్లు పలుమార్లు ఎంజిఎం సూపరిటెండెంట్ దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం కానరాలేదు. ఈ ఇబ్బంది ఎందుకని భావించి రోగులు ప్రైవేటు డయాగ్నస్టిక్స్ సెంటర్లను ఆశ్రయిస్తే సుమారు. రూ.200 చార్జ్ చేస్తున్నారు. ఇక ఈసిజి యంత్రం విలువ రూ.45వేలు మాత్రమే. కోట్ల బడ్జెట్‌తో నిధులతో ఉన్న ఎంజిఎంలో వేల విలువ చేసే యంత్రాలు లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతుంది.

Comments

comments