Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

naga

ఫైట్‌మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. వి.ఎస్. క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాము కొప్పుల దర్శకత్వంలో దివ్య విజయ్ నిర్మించారు. లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్‌ను హైదరాబాద్‌లో అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ “ఇటీవల ‘రారండోయ్ వేడుక చూద్దాం’ షూటింగ్ జరిగినప్పుడు రాహుల్‌ని చూశాను. అందులో కబడ్డీ ఫైట్‌ను విజయ్ మాస్టర్ చేశారు. అప్పుడు రాహుల్‌ను కలవడం జరిగింది. గుడ్ లుకింగ్ బాయ్ అనుకున్నా. ఈ ఫంక్షన్‌కి పిలవడానికి వచ్చినప్పుడు రెండు పాటలు చూపించారు. అవి చూశాక… గుడ్ లుకింగ్ ప్లస్ గ్రేట్ టాలెంట్, రాహుల్ మంచి పేరు తెచ్చుకుంటాడని అనుకున్నా. ఇండస్ట్రీలో పైకి రావడం అంత సులభం కాదు. ప్రతి సినిమాలో ఏదో ఒక ఫ్రెష్‌నెస్, టాలెంట్ చూపించాలి. రాహుల్ కష్టపడి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నా”అని అన్నారు. నిర్మాత దివ్య మాట్లాడుతూ “కొన్ని రోజుల క్రితం రెండు లుక్స్ విడుదల చేశాం. మొదటిది ఫస్ట్ లుక్. రెండోది క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లుక్. రెండిటికీ చాలా మంచి స్పందన వచ్చింది. ఈ రోజు టీజర్‌ను విడుదల చేస్తున్నాం. మా సినిమా నుంచి మేం విడుదల చేస్తున్న ఫస్ట్ కంటెంట్ ఇదే”అని తెలిపారు. విజయ్ మాస్టర్ మాట్లాడుతూ “ఫైట్ మాస్టర్స్ కుమారులు హీరోలు అవుతున్నారు. హిందీలో అలాగే అజయ్ దేవ్‌గణ్ హీరో అయ్యారు కదా. చదువుకు ఆటంకం కలగకుండా రాహుల్ ఆరేడేళ్లు యాక్టర్ కావాలని ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు అతను హీరో అయ్యాడు”అని చెప్పారు. దర్శకుడు రాము మాట్లాడుతూ “అమ్మానాన్నలు పిల్లల మీద చాలా నమ్మకం ఉంచుతారు. అలా నా మీద నమ్మకం ఉంచినవాళ్లు ఇద్దరు. ఒకరు మా గురువుగారు సుకుమార్. రెండో వ్యక్తి విజయ్ మాస్టర్. ఆ నమ్మకమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి నిలబెట్టింది. అమ్మానాన్నలను ఎలా మర్చిపోమో వీళ్లను అలాగే మర్చిపోను. సినిమా చాలా బాగా వచ్చింది”అని పేర్కొన్నారు. రాహుల్ విజయ్ మాట్లాడుతూ “పోస్టర్స్‌కు మంచి స్పందన వచ్చింది. టీజర్ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒక మనిషికి ఇంకో మనిషికి సంబంధం ఉండదు. అలాంటి ఇద్దరు మనుషులు ప్రేమలో పడితే ఆ ప్రేమ ఇంకెంత కొత్తగా ఉంటుం దో? మా సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. సినిమా చూసి ఇంటికి వెళ్లేటప్పుడు… సినిమాలోని కొన్ని ఎమోషన్స్‌ను ఇంటికి తీసుకువెళ్తారు”అని అన్నారు.

Comments

comments