Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ఎల్ కె అద్వానీని పట్టించుకోని మోడీ (వీడియో)

modi-rahul

న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నేత ఎల్ కె అద్వానీని ప్రధాని నరేంద్ర మోడీ గౌరవించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం విమర్శించిన సంగతి తెలిసిందే. మోడీ కంటే తమ పార్టీయే అద్వానీని ఎక్కువ గౌరవిస్తుందని ముంబయిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ అన్నారు. తాజాగా రాహుల్ ట్వీట్టర్ లో ఓ వీడియోను అప్లోడ్ చేసి మరో సారి ప్రధానిపై విమర్శలు గుప్పించారు. గురువుల కోరిక మేరకు ఏకలవ్యుడు తన కుడి చేతి బోటన వేలిని ఇచ్చాడని, కానీ బిజెపి ప్రభుత్వం మాత్రం తమ గురువును దూరం పెడుతుందని రాహుల్ ట్వీట్టర్ వేదికగా చూరుకలంటించారు. బిజెపి సీనియర్ నేతలు అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్ కె అద్వానీ, జస్వంత్ సింగ్ వంటి వారి కుటుంబాలను బిజెపి అవమానిస్తోందని రాహుల్ పేర్కొన్నారు.

Comments

comments