Search
Tuesday 19 June 2018
  • :
  • :

విద్యుత్ షాక్ కు గురైన మున్సిపల్ విద్యుత్ లైన్‌మెన్

 Electric shock hit and dropped under electricity linemen
గజ్వేల్: గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న విద్యుత్ లైన్‌మెన్ యాదయ్య(50) మంగళవారం విద్యుత్ స్థంభం ఎక్కి మరమ్మత్తు పనులు చేస్తుండగా బలమైన విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. శరీరం అంతా బాగా కాలిన గాయాలతో ఆపస్మారక స్థితిలో పడిపోయిన యాదయ్యను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించటంతో వెంటనే అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చాలా కాలంగా పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ లైన్లపై పనిచేస్తున్నట్లు మున్సిపల్ కమీషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తూప్రాన్ రోడ్డులోని ఒక ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన విద్యుత్ మరమ్మత్తు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగలటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఆయన అన్నారు. తీవ్రమైన గాయాలతో గాంధీ ఆసుపత్రికి యాదయ్యను తరలించామని అన్నారు. మున్సిపల్ కు సంబంధించిన విధులకు జరిగిన సంఘటనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Comments

comments