Search
Tuesday 19 June 2018
  • :
  • :

1500 మందికి ఉపాధి

 Employment opportunities for 1500 unemployed youth

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : మలేషియా దేశానికి చెందిన డిఎక్స్‌ఎన్ కంపెనీ సహకారంతో దక్షిణ భారతదేశంలోనే మొట్ట మొదటి సారి గా సిద్దిపేటలో సమీకృత వ్యవసాయధారిత పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట మున్సిపల్ సమావేశ మందిరంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అన్ని సౌకర్యాలు కలిగి ఉంటేనే పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని తెలిపారు. సిద్దిపేట నియెజకవర్గంలోని మందపల్లి, మిట్టపల్లి, రాజగోపాల్ పేట, ముండ్రాయి గ్రామాల వద్ద 500 ఎకరాలలో పరిశ్రమల కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు రూ.175 కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటుతో ఇక్కడి ప్రాంతానికి చెందిన దాదాపు 1500 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు. సిద్దిపేట ఇప్పటికే అనేక రంగాల్లో అభివృద్ధిలో ముందుందని పరిశ్రమ (మొదటి పేజీ తరువాయి) ఏర్పాటులో మాత్రం వెనుకబడి ఉందన్నారు. డిఎక్స్‌ఎన్ పరిశ్రమ దేశంలో గత 18 సంవత్సరాలుగా అనేక చోట్లలో నెలకొల్పిందని, దీంతో సంవత్సరాదాయము కంపెనీకి రూ. 1300కోట్లు వస్తుందన్నారు. డిఎక్స్‌ఎన్ పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ స్థలాన్ని కేటాయించిందని, కేంద్ర అనుమతులు సైతం త్వరలోనే రాబోతునాయన్నారు. అనుమతులు రాగానే పది నెలల వ్యవధిలోనే పరిశ్రమ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు.

ఈ పరిశ్రమలో పౌష్టికాహరం, చర్మసంరక్షణ, ఇతర గృహ అవసరాల ఉత్పత్తులతో పాటు సుమారు 200 రకాల ఉత్పత్తులు తయారు కానున్నట్లు తెలిపారు. ఈ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది వినియెగదారులు ఆన్‌లైనలోనే కొంటున్నట్లు తెలిపారు. సిడిఎస్ సంస్ధకు చెందిన ప్రతినిధులు దళితులకు రాష్ట్ర సర్కార్ ఇచ్చిన 3 ఎకరాల భూమితొ దళితుల బతుకుల్లో ఏమైన మార్పులు వచ్చాయ అనే అంశంపై అధ్యయనం చేశారన్నారు. దళితుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ పెద్ద పీట వేస్తుందన్నారు. ముందుగా దళితుల భూములను కంపెనీ ఒప్పందం కుదుర్చుకొని స్పూరిలీనా, గనోడార్మా, ఔషద ఉత్పత్తులకు అవకాశం ఇస్తూ విత్తనాలతో పాటు పంటను పండిందేందుకు అవసరమైన టెక్నాలజీని అందించడానికి కంపెనీ అంగీకారం తెలిపిందన్నారు. కాలుష్యరహిత కంపెనీలు సిద్దిపేటకు రావడం ఎంతో సంతోషం అన్నారు. పట్టణంలో ఉన్న కాలుష్య పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిశ్రమ కారిడార్‌కు తరలించడం జరుగుందన్నారు. పరిశ్రమ ఏర్పాటు ప్రాంతంలో జాతీయ రహదారి రంగనాయక సాగర్ రిజర్వాయర్, రైల్వెస్టేషన్ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు.

సిఎం కేసిఆర్ సహకారంతో సిద్దిపేట జిల్లా అన్ని రంగాల్లో దూసుకుపోతుదన్నారు. డిఎక్స్‌ఎన్ కంపెనీ వ్యవస్థాపకులు డా.లిమ్‌సియెజిన్, రాష్ట్ర బుద్దావనం ప్రాజెక్టు చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్యలు మాట్లాడుతూ కంపేని ఏర్పాటుతో రైతులతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. రైతులకు పోత్సహిస్తూ కావాల్సిన శిక్షన అందిస్తామన్నారు. కంపెనీ సహకారంతో రైతులు పండించిన పంటకు ఆర్థిక సమృద్ధితో నేరుగా మార్కెట్‌లో విక్రయిస్తామన్నారు. కంపెనీ ఉత్పత్తి చేసే వస్తువుల్లో ఎలాంటి రసాయనాలు వాడమని తెలిపారు. మంత్రి హరీశ్‌రావు జన్మదిన సందర్భంగా కంపెనీ ఏర్పాటుపై ప్రకటన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా డైరెక్టర్ మచ్చవేణుగోపాల్ రెడ్డి, సిడిఎస్ సంస్థ, డిఎక్స్‌ఎన్ కంపెనీ ప్రతినిధులు మంగేష్, అంజనేయులు, రాము తదితరులు పాల్గొన్నారు.

Comments

comments