Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

ఉద్యోగ బదిలీల్లో పదనిసలు

Employments transfers in Kamareddy district

మనతెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని ఉద్యోగ బదిలీలలో పలు ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. జిఒ 16 ద్వా రా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 8600 ఉపాధ్యాయులు, 2510 ఉద్యోగుల బదిలీలకు కసరత్తులు జరుపుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో బదిలీల కోసం ఉద్యోగులు ఆప్ష న్లు ఇచ్చారు. కొన్ని శాఖలకు కౌన్సిలింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీల హడావిడి జోరందుకుంది. కొందరు సంఘం నేతలు బదిలీ చేస్తామని ప్రసారం చేసుకుంటున్నారు. బదిలీల ఆప్షన్లు ఆన్‌లైన్లో ఉండడంతో ఉన్నతాధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుందని వాపోతున్నారు. 15, 20 ఏళ్లుగా పాతుకుపోయిన వారికి స్థానచలనం లేకుండా లోలోపల ప్రయత్నం చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు 20,40 శాతం ఉండాలని ఉత్తర్వులు ఇవ్వడంతో కొన్ని కార్యాలయాల్లో అరకొర సిబ్బందితో నెట్టుకొచ్చే పరిస్థితు లు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే చోట పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది బదిలీలు జరగకుండా ముందస్తూ ప్రయత్నాలు జరుపుతున్నారు. రూల్స్‌కు తూట్లు పొడుస్తూ అక్రమాలకు తెర తీస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లో వెంటనే పూర్తి స్థాయిలో సిబ్బందిని బర్తీ చేయాలని, ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వారిని బదిలీ చేయాలని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నాయి. కామారెడ్డి జిల్లాకు ఏ ఉద్యోగి కూడా బదిలీపై రావడానికి జంకుతున్నారు. ముఖ్యంగా వైద్యావిదానపరిషత్ ఆసుపత్రుల్లో , ఏరియా ఆసుపత్రిల్లో స్టాప్ కొరత తీవ్రంగా ఉంది. పాతుకుపోయిన అక్రమార్కుల మూల ంగా బదిలీలపై అప్రతిష్ట కొనసాగుతుంది. ఈ బదిలీల్లో రెవెన్యూ, పం చాయతీరాజ్ విభాగాలకు మినహాయింపు ప్రభుత్వం కల్పించింది. భూ ప్రక్షాలణ కారణంగా రెవెన్యూ శాఖకు, జులై లో పంచాయతీ ఎన్నికల కోసం ఆయా శాఖల్లో మినహాయింపు ఇచ్చింది.
నచ్చిన వారికి అనుకూల బదిలీలు, నచ్చని వారికి అసంతృప్తి
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, ఇరిగేషన్, రూరల్ వాటర్ సపై రోడ్లు భవనాలు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డెవలాప్‌మెంట్ కార్పోరేషన్‌లలో ఏండ్ల తరబడి అధికారులు, సిబ్బంది పా తుకుపోయారు ఒకే చోట ఏండ్ల తరబడి పనిచేయడంతో అవినీతి అక్రమాల ఆరోపణలు వస్తున్నాయి. వైద్యావిదానపరిషత్ ఆసుపత్రిలలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి, కామారెడ్డి, బాన్సువాడ, దోమకోండ, ఎల్లారెడ్డి ఆసుపత్రుల్లో సిబ్బంది బదిలీల్లో సీనియార్టీ లిస్టు తయారీల్లో తప్పులు దొర్లాయని పలు ఆరోపణలు వస్తున్నాయి. సీనియార్టి లిస్టు పేరిట డబ్బులు చేతులు మారుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

Comments

comments