Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

‘సంస్కరణలకు తెలంగాణ గొప్ప కేంద్రం కాబోతోంది’

Etela Rajender says Telangana is going to be a great center for reforms

హైదరాబాద్: నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఫిక్కీ ఆధ్వర్యంలో నకిలీలు, స్మగ్లింగ్‌పై పోరాటం-ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేయడం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… సంస్కరణలకు తెలంగాణ గొప్ప కేంద్రం కాబోతున్నదని చెప్పారు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నకిలీలపై ఉక్కుపాదం మోపుతోందని మంత్రి గుర్తుచేశారు. నకిలీలపై ఎలాంటి సమాచారమిచ్చిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఈటల పేర్కొన్నారు.

Comments

comments