Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

రూ. 5 లక్షల బీమా దేశంలోనే గొప్పది

Every farmer To Rs 5Lakh  Insrence Scheme

మన తెలంగాణ / తాండూరు రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతికి సిఎం కెసిఆర్ చేయూతనిస్తున్నారని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామంల్లో  రూ.11 కోట్లతో  గ్రామాభివృద్ధికి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు.  మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామంలో  జనహిత గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిమహేందర్ రెడ్డి  మాట్లాడుతూ రూ.4కోట్ల 43లక్షలతో మిషన్ భగీరథ  పనులు, రూ. 10 లక్ష ల  పశువుల ఆస్పత్రి భవనం, రూ. 20లక్ష లతో ప్రాథమిక ఆరోగ్య భవనం, రూ. 6 లక్షలతో రూర్బన్ పథకం  ఎల్‌ఈడి లైట్లు, రూ. 26లక్షలతో మిషన్ కాకతీయ చెరువులు, 12 మందికి రూ .8 లక్షల 80 వేల కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందించడం జరిగింది. అదే విధంగా రూ. 5లక్షలతో మైనార్టీ శ్మశాన వాటిక ప్రహరీ గోడ, అంగన్ వాడీ గోడలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సిఎం కేసిఆర్ హయాంలో అభివృద్ధి సంక్షేమం లక్షల కోట్లతో జోడెద్దుల్లా ముందుకు  సాగుతుందన్నారు. రైతు బిడ్డగా రాష్ట్రంలో రూ.12వేల కోట్లతో 58.33లక్షల మంది రైతులకు ఎకరాకు 8వేలు పెట్టుబడులు అందిస్తున్నామన్నారు.దేశంలోని ఎక్కడ లేని విధంగా ప్రతి రైతుకు రూ.5లక్షల బీమా అందిస్తున్న ఘనత సిఎం కేసిఆర్‌కు దక్కుతుందని పేర్కోన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీటిని అందించే విధంగా త్వరితంగా చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో   ఎంపిపి కొస్గి లక్ష్మమ్మ,మార్కెట్ కమిటి చైర్మన్ మాదవరెడి,్డవైస్‌ఎంపిపి శేఖర్, మాజీ వైస్ ఎంపిపిరాజప్పగౌడ్,టిఆర్‌ఎస్‌మండలఅధ్యక్షుడు,రాందాస్,రైతుసమన్వయ సమితికన్వీనర్‌రాంలింగారెడ్డి,ఎంపిడిఓ జగన్మోహన్‌రావు,సూపరింటెండెంట్ లక్ష్మప్ప, వడ్డె శ్రీనివాస్,అధికారులు,డిఇలు శ్రీనివాసు,వెంకటెశ్వరులు,నీరజ,ఎంఇఓ వెంకటయ్యగౌడు,తహసీల్దార్ రాములు,సర్పంచ్ శివకుమార్,ఎంపిటిసిలు రాజ్‌కుమార్,వసంత్‌కూమార్, టిఆర్‌ఎస్ నాయకులు మొగులప్ప,యాదయ్య. గ్రామాల లబ్ధిదారులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

comments