Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

రైతుబంధు అద్భుతం

 Every farmers eyes are filled with happiness

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి: ముఖ్య మంత్రి కెసిఆర్ నేతృత్వంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు అద్భుతమైన పథకమని టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్ళపల్లి రవీందర్‌రావు అన్నారు. మంగళవారం స్థానిక మార్గదర్శి బిఇడి కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం నింపడమే ధ్యేయంగా రైతు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన అన్నారు. ప్రతి రైతు పెట్టుబడి సాయం తీసుకుని చినుకు పడడంతో దుక్కులు, పత్తి విత్తనాలు నాటే కార్యక్రమంలో ఇప్పటికే నిమగ్నమయ్యారని, గతంలో రైతు దుక్కిలోకి దిగనప్పుడు లేని ఆనందం టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు పథకంతో రెట్టింపు అయిందన్నారు. రాష్ట్రంలో రైతు బలపడాలని, సమస్యలు లేకుండా సాఫీగా వ్యవసాయం చేసే దిశగా ప్రభుత్వం రైతుకు భరోసా కల్పిస్తోందన్నారు. సమన్వయ కమిటీల సాయంతో వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు, ప్రతి 58వేల ఎకరాలకు ఒక క్లష్టర్‌ను ఏర్పాటుచేసి పకడ్భందీగా ప్ర భుత్వం ఆలోచిస్తోందన్నారు. డిసెంబర్ నాటికి కోటి ఎకరాలకు సాగునీరు ప్రాజక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, అలాగే స్వచ్ఛమైన తాగునీరు నల్లాల ద్వారా ప్రతి ఇంటికీ ఇచ్చేందుకు మిషన్ భగీరథ పథకం కూడా చివరి దశకు చేరుకుందని, డిసెంబర్‌నాటికీ ఇంటిటికీ స్వచ్ఛమైన నీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు.
రైతు సంక్షేమమే లక్షంగా..
రైతు సంక్షేమమే లక్షంగా రైతు భీమాను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎల్‌ఐసితో ఒప్పందం చేసుకుని ప్రతి రైతుకు భీమాతో కుటుంబానికి ధీమా కల్పించారని రవీందర్‌రావు తెలిపారు. రైతు సాధారణ, ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5లక్షలు భీమా సోమ్ము అందించి రైతుబంధువుగా కెసిఆర్ రైతు కుటుంబం పక్షాన నిలిచారన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం అయ్యాయని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుచేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అలాగే నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్రంలో గురుకులాలు ఏర్పాటుచేశారని, ప్రభుత్వ విద్య బలోపేతం అవుతోందని ఆయన అన్నారు. కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేక, ప్రజల స్పందన చూసి ఓర్వలేక కాంగ్రెస్ విషప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీకే బ్రహ్మరథం పడతారని, ప్రతి గ్రామంలో గులాబి జండా ఎగరడం ఖాయమని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రతిపక్షాలు ప్రజలకు దూరమవ్వడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు గద్దల నరసింగరావు, శోభన్‌కుమార్, మధుకర్, జెర్రిపోతుల వెంకన్న, మంగళంపల్లి ఖన్నా, కొండపల్లి కరుణాకర్‌రెడ్డి, వంగ అశోక్‌గౌడ్, రమేష్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments