Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

సరోజిని కంటి ఆస్పత్రిలో ‘ఐ’ బ్యాంక్‌

Eye bank started in Sarojini Devi Eye Hospital Today

హైదరాబాద్: మంత్రి ల‌క్ష్మారెడ్డి నగరంలోని సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో బుధవారం ‘ఐ’ బ్యాంక్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… ఐ బ్యాంక్ ద్వారా కార్నియాను నిలువ చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి అక్కడే కళ్లద్దాలు ఇస్తామని తెలిపారు. ఇటీవల నీలోఫర్ ఆస్పత్రిలో మిల్క్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు అన్ని రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి ల‌క్ష్మారెడ్డి అన్నారు.

Comments

comments