Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

జలందర్ దిష్టి బొమ్మ దగ్ధం

Farmers are retu or have serious difficulties

తల్లాడ: మండలంలోని రైతులు మిర్చి వ్యాపారి జలందర్ ఇంటి నుండి రింగు రోడ్డు మీదుగా రైతులు ర్యాలీగా దిష్టి బొమ్మను తీసుకోని స్దానిక బస్టాండ్ సెంటర్‌లో అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో బుదవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ, ఎంతో కష్టపడి పండించిన పంటకు ధర లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే అధిక ధర కల్పిస్తామని చెప్పి రైతుల దగ్గర క్వింటాలలో మిర్చి కోనుగోలు చేసి మోసానికి పాల్పడిన జలందర్‌ను వెంటనే అరెస్టు చేసి రైతులకు న్యాయం చేయాలని వారు అన్నారు. గత 15 రోజుల నుండి రైతులు వ్యాపారి ఇంటి ఎదుట ధర్న నిర్వహించిన అధికారులు రైతులపై మెండి వైఖరిని చూపిస్తున్నరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి మోసాలకు పాల్పడిన వ్యక్తులపై కఠన చర్యలు తీసుకోకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోనే పరిస్ధితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘ నాయకులు తాతా భాస్కర్‌రావు, మండల రైతు సంఘ నాయకులు గుంటపల్లి వెంకటయ్య, కాంగ్రెసు మండల అధ్యక్షుడు కాపా సుదాకర్, టిఆర్‌యస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీర మోహన్‌రెడ్డి, నాయకులు, రైతులు ఉన్నారు.

Comments

comments