Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

రైతు ధీమాకే బీమా

ఆగస్టు 15నుంచి అమలు : మంత్రి కెటిఆర్

KTR

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలోని రైతుల కుటుంబాల్లో ధీమా పెంచేందుకే ప్రభు త్వం రైతు బీమా పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుం చి అమలు చేయనున్నదని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నా రు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డితో కలిసి వ్యవసాయ కళాశాల భవన నిర్మాణ పనులకు బుధవారం మంత్రి కెటిఆర్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతుబీమా అవగాహన సదస్సులో  మంత్రి కెటిఆర్ మాట్లాడారు. ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ  లక్షలాది మంది రైతుల కుటుంబాలకు ధీమానిచ్చేలా రైతు బీమా పథకాన్ని అమ లు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్క రైతుకు సంబంధించిన బీమా ప్రీమియంను ప్రభుత్వమే రూ.2,271ఎల్‌ఐసికి చెల్లిస్తుందని, 18నుండి 60 సంవత్సరాల వయస్సు గల రైతులు సాధారణంగా కాని ప్రమాదవశాత్తు కాని మృతి చెందితే 10 రోజుల్లో రూ.5లక్షల చెక్కు ఆ రైతు కుటుంబానికి అందుతుందని మంత్రి వివరించారు. జూలై 10వ తేదీలోగా రైతులు తమ నామినీ ఎవరో వివరిస్తూ రైతు బీమా పథకం దరఖాస్తును నింపితే సరిపోతుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సిఎం కెసిఆర్‌లాగా రైతులకు ఇంతగా ప్ర యోజనం కలిగేలా తీసుకున్న నిర్ణయాలను గతంలో ఏ ప్రధాన మంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేదన్నారు. సిఎం కెసిఆర్ నిర్ణయాలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయన్నారు. కెసిఆర్ స్వయంగా రైతు బిడ్డ కాబట్టి రైతుల కోసం మంచి ఆలోచనలు చేస్తున్నారన్నారు. స్వామినాథన్ కమీషన్ వ్యవసాయ రంగం అభివృధ్ధికి చేసిన సూచనలను ఇంతకాలం ఎవరూ పట్టించుకోలేదని, సిఎం కేసిఆర్ వాటికి తన రైతు అనుకూల చర్యల ద్వారా అమలు చేస్తున్నారన్నారు. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలసలు వెళ్లిన వారు కూడా తిరిగి స్వగ్రామానికి వచ్చి కుటుంబాలతో ఆత్మగౌరవంగా బ్రతికేలా చేస్తామన్నారు. గల్ఫ్‌కు వెళ్లిన రైతుల పాస్‌పుస్తకాలు త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని మెట్టప్రాంతాలన్నీ త్వరలోనే సాగునీటితో సస్యశ్యామలం కానున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణలోని 38 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగునీటిని అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మద్దతు ధర చెల్లింపులో మనమే బెస్ట్
రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు చెల్లించడంలో తెలంగాణ ప్రభుత్వమే ముందున్నదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల నుండి మక్కలు కొనుగోలు చేస్తున్నదని, బీహర్‌లో క్వింటాల్ మక్కలకు రూ.1100౦ అమెరికాలో క్వింటాల్ మక్కలకు రూ.900 చెల్లిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం క్వింటాల్ మక్కలకు రూ.1425 చెల్లిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జడ్‌పి చైర్మన్ తుల ఉమ, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సిరిసిల్ల నియోజక వర్గంలో నాలుగేళ్లుగా చేపట్టిన పనులతో రూపొందించిన ప్రగతి నివేదికను వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.

Comments

comments